Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుత్తాజ్వాల కేక పెట్టించే ఫోటోషూట్... ఫోకస్ ఎటువైపు?

గుత్తాజ్వాల కేక పెట్టించే ఫోటోషూట్... ఫోకస్ ఎటువైపు?
, బుధవారం, 13 నవంబరు 2013 (16:27 IST)
FILE
బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల ఏదోవిధంగా వార్తల్లోకి వస్తూనేవుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ మేగజైన్‌కు కేకపెట్టించే ఫొటోషూట్ ఒకటి ఇచ్చింది. దీంతో ఆమె మళ్లీ గ్లామర్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. బ్యాడ్మింటన్‌లో తనకంటూ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది గుత్తాజ్వాల. బాగా రాణిస్తున్న సమయంలో టాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. ఓ సినిమాలో కూడా నటించింది.

దీంతో ఆటకు రిటైర్‌మెంట్ ఇచ్చే అవకాశమున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. చివరకు వాటిని ఖండించి... మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె ఓ మేగజైన్‌కి ఫొటోషూట్ ఇచ్చింది. తన అందచందాలను చూపిస్తూ తానింకా యంగే‌నంటూ క్రియేట్ చేసే ప్రయత్నంచేసింది.

మరి ఈసారి ఆమె చూపు ఎటువైపోనని చర్చించుకుంటున్నారు. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో స్పెషల్‌సాంగ్ చేసే ముందూ ఇలాంటి షూట్ ఒకటి ఇచ్చింది. మరి ఈ లేటెస్ట్ షూట్ ద్వారా బాలీవుడ్ వైపు కన్నేసిందేమోనని ఇండస్ట్రీ టాక్.

Share this Story:

Follow Webdunia telugu