ముచ్చటగా మూడోసారి.. పీట్ సంప్రాస్ సరసన నోవాక్ జకోవిచ్

యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ మూడోసారి ముచ్చటగా గెలుచుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో మాజీ విజేత అర్జెంటీనా టాప్ సీడ్ డెల్‌పొట్రోపై నోవాక్ జకోవిచ్ గెలిచాడు. ఆద్యంత

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:47 IST)
యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ మూడోసారి ముచ్చటగా గెలుచుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో మాజీ విజేత అర్జెంటీనా టాప్ సీడ్ డెల్‌పొట్రోపై నోవాక్ జకోవిచ్ గెలిచాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోరులో 6-3, 7-6, 6-3 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. ఫలితంగా జకోవిచ్ ముచ్చటగా మూడోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.
 
ఇప్పటివరకు డెల్‌పొట్రో, జకోవిచ్‌లు 19 సార్లు తలపడ్డారు. వీటిల్లో 15సార్లు జకోవిచ్‌నే విజయం వరించింది. తాజా విజయంతో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పీట్ సంప్రాస్ సరసన చేరిపోయాడు. ఈ జాబితాలో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

LOADING