Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామనవమి.. వీలైతే ఇవి చేయండి.. ఇవి మాత్రం చేయకండి..

Kriti Sanan visiting the 1761 Rama-Sita temple

సెల్వి

, మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (20:48 IST)
Kriti Sanan visiting the 1761 Rama-Sita temple
శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితిల్లో మద్యంతో పాటు మాంసం కూడా ముట్టుకోకూడదు. పండుగ రోజున తయారు చేసుకునే వంటల్లో అల్లం వెల్లుల్లిని ఉపయోగించూడదు.. తీసుకోకూడదు. పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం అశుభమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శ్రీరామనవమి రోజున వీలైతే రామచరిత మానస, రామ చాలీసా పారాయణం చేయాలి. 
 
"ఓం శ్రీ రామయః నమః.. శ్రీ రామ జయ రామ జయ జయ రామ.. ఓం దశరథ తనయాయ విద్మహే.. సీతావల్లభయ ధిమాహీ తనో రామ ప్రచోదాయత్" అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముడిని పూజించాలి. దాంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది. 
 
ఆ రోజున ఉపవాసం ఆచరించడం ద్వారా సుఖం, శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి. శ్రీ రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి, ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం మంచిది. శ్రీరాముడిని పూజించే సమయంలో ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. పేదలకు అన్నదానం చేయాలి. 
 
చేయాల్సిన పనులు
శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకుని ఆరోజును ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. శ్రీరామ నవమి రోజు స్వామివారికి నివేదించిన తర్వాత పానకం, వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరామ నవమి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?