Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకృష్ణాష్టమి రోజున పూజ.. గోదానం చేసిన ఫలితాన్నిస్తుందట..

శ్రీకృష్ణాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతాన్ని ఆచరిస్తే గోదానం చేసిన ఫలితంతో పాటు కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కలియుగంలో కల్మషాల్ని హరిం

శ్రీకృష్ణాష్టమి రోజున పూజ.. గోదానం చేసిన ఫలితాన్నిస్తుందట..
, గురువారం, 30 ఆగస్టు 2018 (11:19 IST)
శ్రీకృష్ణాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతాన్ని ఆచరిస్తే గోదానం చేసిన ఫలితంతో పాటు కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాలను ప్రసాదించే పర్వదినం శ్రీకృష్ణాష్టమి. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. 
 
ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజ మందిరాల్లో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధం, తులసి మాల, శ్రీ కృష్ణుడి విగ్రహం, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరంను ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో ఉన్న ఫోటోను గానీ, ప్రతిమను కానీ ఉంచాలి. 
 
కంచు దీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమత్భావగతములతో శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.
 
కృష్ణాష్టమి నాడు భక్తుడు శ్రీకృష్ణుడిని నిష్ఠతో పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణున్ని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఇలా స్వామివారిని స్తుతింటే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి.
 
కృష్ణాష్టమినాడు వెండితో తయారుచేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాదికాలతో అర్ఘ్యం ఇస్తే మనసున తలచిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం, మరునాడు భోజనం చేయాలి. 
 
ఉపవాసం, పూజ, జాగరణలు నిర్వహించాలి. అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీ కృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడలు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి. 
 
శ్రీ కృష్ణునికి పొన్నపువ్వులంటే ఇష్టం. ఆ పువ్వులతో స్వామిని పూజిస్తే అనుకున్న కార్యాలు పూర్తవుతాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం (30-08-2018) దినఫలాలు - స్త్రీలకు పొరుగువారి నుంచి...