Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం... అడవి పిల్లిగా భావించిన సిబ్బంది...

leopard

వరుణ్

, సోమవారం, 29 ఏప్రియల్ 2024 (09:46 IST)
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం రేపింది. ఈ చిరుతను తొలుత అడవి పిల్లిగా ఎయిర్ పోర్టు సిబ్బంది భావించారు. ఆ తర్వాత కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరశీలించి చిరుత పులిగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పిమ్మట దీన్ని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేసి చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు సూచించారు చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటుచేశారు. 
 
ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పరిసరాలలో అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. గొల్లపల్లి గ్రామం నుంచి విమానాశ్రం గోడ దూకి లోపలికి వచ్చినట్టు అధికారులు సీసీ కెమెరాల్లో గుర్తించారు ప్రహరీ గోడ దూకే సమయంలో చిరుత ఫెన్సింగ్ వైర్లను తాకిన ఆనవాళ్లను అధికారులు గుర్తించడం జరిగింది. మూడేళ్ల క్రితం కూడా ఇలానే చిరుత ఎయిర్‌పోర్టులో తిరిగినట్టు అధికారులు గుర్తించారు. అయితే, సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అధికారులు దాన్ని అడవి పిల్లిగా గుర్తించారు. ఈసారి కూడా అడవి పిల్లినే కావొచ్చని మొదట ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమానించింది. కానీ, అటవీశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి చిరుతగా నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ వంటి వ్యక్తులను ప్రధాని ఖచ్చితంగా శిక్షిస్తారు : పవన్ కళ్యాణ్