Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి ఒకటో తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు..

మార్చి ఒకటో తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు..
, శనివారం, 9 డిశెంబరు 2023 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని ఈ వారం రోజుల్లో టైంటేబుల్‌ను అధికారికంగా ప్రకటించనుంది. 
 
అయితే, వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు, జవాబుపత్రాల మూల్యాంకనానికి ఇబ్బంది లేకుండా ఈసారి కొంత ముందుగా పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నారు. గత విద్యా సంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడత ఎగ్జామ్స్ ఉండటంతో ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు ఉంటే విద్యార్థులు సన్నద్ధమవడానికి వీలవుతుంది. దానికితోడు ఇంటర్ తర్వాతే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. ఈసారి జూన్ 1వ తేదీ నుంచే ఇంటర్ కళాశాలలు ప్రారంభంకావడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే, ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారు.
 
మరోవైపు, ఇంటర్ బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు బీటెక్‌లో చేరేందుకు గణితం బ్రిడ్జి కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ పరీక్షలప్పుడు చివరిలో బ్రిడ్జి కోర్సు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అది రాయాలంటే ఫీజు చెల్లించాలి. చాలా మంది విద్యార్థులకు ఇది తెలియడం లేదు. దాంతో వారు పరీక్షలు రాయడానికి వీల్లేకుండా పోతోంది. అందుకే ఈసారి బ్రిడ్జి కోర్సు పరీక్షకు ప్రత్యేకంగా దరఖాస్తు, ఫీజు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరూ బ్రిడ్జి కోర్సుకు హాజరయ్యేలా హాల్టికెట్లపై తేదీలను ముద్రించనున్నారు. ఆసక్తి ఉన్న ప్రతి ఇంటర్ బైపీసీ, ఒకేషనల్ గ్రూపు విద్యార్థులు హాజరు కావచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ కొత్త మంత్రివర్గం : శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ పెద్దల మంతనాలు..