Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పెయిన్ అబ్బాయితో తెలుగు యువతి డుం.. డుం.. డుం

spain youth - Telugu girl

ఠాగూర్

, గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:12 IST)
తెలుగు యువతి ఒకరు స్పెయిన్ అబ్బాయిని వివాహం చేసుకున్నారు. తెలంగాణాలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన లావణ్య, స్పెయిన్‌కు చెందిన మార్క్ మాన్‌సిల్లాలు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ ఇపుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఒకే సాఫ్ట్‌‍వేర్ సంస్థలో పని చేస్తు్న వీరు తమ కుటుంబ సభ్యుల అనుమతితో వివాహం చేసుకున్నారు. 
 
సత్తుపల్లికి చెందిన విద్యాభారతి కాలేజీ డైరెక్టర్ మందడపు సత్యనారాయణ, సుజని దంపతుల కుమార్తె లావణ్యం. స్పెయిన్‌లోని అవిన్ గూడ బార్సిలోనాకు చెందిన మారియానో మన్‌సిల్లా, ఎమిలియా దంపతుల కుమారుడు మార్క్ మాన్‌సిల్లా, వీరిద్దరూ ఒకచోట పని చేస్తుండటంతో మనసులు కలిశాయి. తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పడంతో వారు కూడా సమ్మతం తెలిపారు. దీంతో బుధవారం సత్తుపల్లిలోని సాయిబాలాజీ ఫంక్షన్ హాలులో వీరిద్దరి వివాహం బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి కొత్త వెబ్‌సైట్ - మిథ్ వర్సెస్ రియాలిటీ రిజస్టర్!! 
 
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి భారత ఎన్నికల సంఘం ఓ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సహ ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులతో కలిసి ప్రారంభించారు. అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టి, ఎన్నికల సమయంలో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించేందుకు ఈ కొత్త వెబ్‌సైట్‌ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రజలు ఎప్పటికపుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టరు ద్వారా అప్‌డేట్ చేస్తూ ఓటర్లకు తెలియజేస్తాని ఎన్నికల కమిషన్ చెప్పింది. 
 
రాజ్యసభ నుంచి మన్మోహన్ సింగ్ రిటైర్... 33 యేళ్ల తర్వాత.. 
 
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. 33 యేళ్లుగా ఆయన రాజ్యసభ్యుడుగా సుధీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. ఆయన పదవీకాలం ముగిసిపోయింది. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ముగిసిన పలువురి రాజ్యసభ పదవీకాలం కూడా ముగిసిపోతుంది. అదేసమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. మంగళవారంతో పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసింది. ఇందులో మన్మోహన్ సింగ్ ఉన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, వైకాపా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్‌లు ఉన్నారు. మన్మోహన్ సింగ్ సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం నేటితో ముగిసింది. ఇందులో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఉండటం గమనార్హం. రాజ్యసభకు తొలిసారి వెళుతున్న సోనియా గాంధీ తొలిసారి రాజస్థాన్ నుంచి తొలిసారి రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారు. కాగా, మన్మోహన్ సింగ్ గత 1991 నుుంచి 1996 వరకు మధ్య పీవీ నరసింహా రావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు.
 
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు రేపు, ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పదిమంది కొత్త సభ్యులతో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎల్లుండి మరో 11 మందితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్యాంకులో పడి కోతులు మృతి!! నల్గొండ జిల్లాలో విషాదం!