Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ కొత్త వేరియంట్‌పై ఆందోళన.. నేడు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్

damodara rajanarsimha
, గురువారం, 21 డిశెంబరు 2023 (08:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహా బుధవారం ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా, డీహెచ్ రవీంద్రనాయక్, డీఎంఈ త్రివేణి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి రాజనర్సింహా అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. గురువారం అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రులకు అవసరమైన డీఎంఎంఎస్ ఐడీసీ ద్వారా తీసుకోవాలన్నారు. రోగ లక్షణాలు ఉన్న వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు చేయాలని, పాజిటివ్ వచ్చిన శాంపిళ్ళను ఉప్పల్‌లోని సీడీసీకి పంపించాలని ఆదేశించారు.
 
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై వైద్య ఆరోగ్య సిబ్బంది మంత్రికి వివరించారు. ప్రస్తుంత రాష్ట్రంలో కొత్త వేరియంట్ పాజిటివ్ రేట్ 0.31 శాతంగా ఉందని తెలిపింది. అంతకుముందు కోవిడ్ సన్నద్ధతపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహాతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
పెరుగుతున్న కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు 
 
తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. జీఎన్1 అనే కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని, బుధవారం కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ  వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14గా ఉన్నట్టు పేర్కొంది. ఈ కొత్త కేసులన్నీ హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్టు వైద్య శాఖ తెలిపింది. అయితే, ఈ కొత్త వేరియంట్ కేసులు ఒక్క తెలంగాణాలోనే కాకుండా దేశీయంగా కూడా పెరుగుతున్నాయి. 
 
వైద్య శాఖ వివరాల మేరకు.. కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరింది. కొత్తగా నమోదైన కేసులన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణాలో ఆరు కొత్త కేసులు నమోదు కాగా, ఒకరు కోలుకున్నారని, ప్రస్తుతం ఈ వైరస్ బారినపడినవారిలో కోలుకునే శాతం 99.51 శాతంగా ఉందని తెలిపింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతున్న కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు