Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శంషాబాద్ విమానాశ్రయానికి టీఎస్ ఆర్టీసీ బస్సులు

tsrtc
, గురువారం, 14 డిశెంబరు 2023 (14:37 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఏసీ బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. మొత్తం ఐదు కొత్త మార్గాల్లో నాన్ ఏసీ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సు సర్వీసుల్లో కూడా మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. 
 
బస్సు సర్వీసులను ప్రారంభించిన మార్గాలను పరిశీలిస్తే, 
 
రూట్ నంబర్ 295ఏ :కేపీహెచ్‌బీ మెయిన్ రోడ్డు - రాజీవ్ గాంధీ విమానాశ్రయం మధ్య 4 ఆర్డినరీ బస్సులు.
 
229/95ఏ : సుచిత్ర - విమానాశ్రయం మధ్య ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
 
3కే/95ఏ : ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు - విమానాశ్రయం మధ్య 4 సిటీ ఆర్డినరీ బస్సులు.
 
303 : కొండాపూర్ - విమానాశ్రయం మధ్య సిటీ ఆర్డినరీ బస్సులు 
 
90ఎల్ / 251 ఏ : సికింద్రాబాద్ - విమానాశ్రయం మధ్య 4 మెట్రో ఎక్స్‌ప్రెస్ రైలు


అయోధ్య రామ మందిర్ ఆలయ ట్రస్టుకు నిధుల వరద 

 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలతో ట్రస్టుకు కుబేరుని ఆశీర్వాదం ఉందన్నారు. ఇప్పటికే రూ.900 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇంకా తమ వద్ద రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు వెల్లడించారు. 
 
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ట్రస్టు భావిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరు చోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నట్లు రామమందిర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్ర తెలిపారు.
 
'ప్రాణప్రతిష్ట సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు సహా మేము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించాం' అని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కిశల్యమైన కెప్టెన్ విజయకాంత్, కన్నీటి పర్యంతమైన కార్యకర్తలు