Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మందేసి డ్రైవ్ చేస్తున్నారా సార్... వెయ్యిస్తే తప్పించేస్తాం...

మందేసి డ్రైవ్ చేస్తున్నారా సార్... వెయ్యిస్తే తప్పించేస్తాం...
, శనివారం, 1 డిశెంబరు 2018 (19:36 IST)
మందేసి డ్రైవ్ చేస్తున్నారా సార్ ముందు డ్రంకన్ డ్రైవ్ చెకింగ్స్ ఉన్నాయ్.. పోలీసులకు చిక్కకుండా ఆ కాస్త దూరం డ్రైవ్ చేస్తాం.. వెయ్యిస్తే పోలీస్ చెకింగ్ పాయింట్ దాటిస్తాం అంటూ కారు నడిపే మందుబాబులతో బేరసారాలు చేస్తున్నారు ఆటోడ్రైవర్లు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని బ్లడ్ బ్యాంక్ దగ్గర అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించసాగారు. అదే అదునుగా సులువుగా డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కారు కొందరు ఆటోడ్రైవర్లు. వీకెండ్ వస్తే చాలూ మందుబాబులను చట్టం నుంచి తప్పిస్తూ.. డబ్బు పోగేసుకుంటున్నారు ఆటోడ్రైవర్లు.
 
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరకు మందుబాబులైన డ్రైవర్లను తప్పిస్తున్నారు ఆటోవాలాలు. రమేష్ అనే ఆటోడ్రైవర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నిలబడి కారు దగ్గరకు వెళ్తున్నాడు చూడండి. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ప్లేస్‌లోకి వెళ్లాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ చేతబట్టి ఇలా డ్రైవ్ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించే ప్రయత్నం చేశాడు. ఇందుకు ఆటోడ్రైవర్ రమేష్ వసూలు చేసేది ఒక్కో కారు నడిపే తాగుబోతు నుంచి వసూలు చేసేది వెయ్యి రూపాయల నుంచి 2 వేల వరకు. డ్రంకన్ డ్రైవ్ స్పాట్ ఈ కొద్ది దూరం దాటిస్తే.. అప్పటికప్పుడు డబ్బు చేతికొచ్చేస్తుంది. ఆటోడ్రైవర్ రమేష్ దొరకడంతో మిగిలిన డ్రైవర్లు అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నారు. 
 
కారు నడిపే అతను మద్యం తాగి ఉండటంతో తనను డ్రైవ్ చేయమన్నారని.. అందుకు డబ్బిస్తామన్నారని చెప్తున్నాడు ఆటోడ్రైవర్లు. డ్రంకన్ డ్రైవ్ కేసు నుంచి తప్పించడానికి ఆటోడ్రైవర్లు ప్రయత్నించడంపై పోలీసుల్ని ప్రశ్నించగా.. చెక్ చేసేటప్పుడు డ్రైవ్ చేసేవారిని మాత్రమే తనిఖీ చేస్తామని.. డ్రైవర్లు మారితే తామేం చేయగలమంటున్నారు పోలీసులు. వీడియో ఫుటేజ్ ఉందని చెప్పడంతో చేసేది లేక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగిస్తామని.. కారును సీజ్ చేస్తామని చెప్పారు ట్రాఫిక్ పోలీసులు. సికింద్రాబాద్‌కు చెందిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్ అభిషేక్ శుక్లా మద్యం తాగిన మత్తులో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అతని కారును పోలీసులు సీజ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకి జ్ఞానం వచ్చి వుంటుందిలే అనుకున్నా... ఇలా చేస్తారనుకోలేదు... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌