Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్

kcr nomination
, గురువారం, 9 నవంబరు 2023 (13:12 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత కేసీఆర్ తన ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. 
 
అలాగే, ఆయన కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలను స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అలాగే, మరికొందరు బీఆర్ఎస్ నేతలు తమ నామినేషన్ పత్రాలను తమతమ అసెంబ్లీ స్థానాల్లోని రిట్నింగ్ అధికారులకు అందజేశారు. 
 
విద్యార్థికి 14 యేళ్ళు.. టీచరమ్మకు 22 యేళ్లు.. స్కూల్‌లో శృంగారం.. ఎక్కడ? 
 
ఇటీవలి కాలంలో కేవలం విద్యార్థుల ప్రవర్తన హద్దులుదాటివుంటుంది. వారిని సక్రమ మార్గంలో నడిపించాల్సి ఉపాధ్యాయుల్లో కొందరు వక్రమార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈ కారణంగా పలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా 22 యేళ్ల టీచరమ్మ ఒకరు 14 యేళ్ల విద్యార్థితో స్కూల్‌లో శృంగారంలో పాల్గొంది. ఈ విషయం వెలుగులోకి రాగానే, పోలీసులు విచారణ జరిపి ఆమెను అరెస్టు చేశారు. ఈ సంఘటన అమెరికాలోని మాంట్‌గోమెరి కౌంటీలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మాంట్‌గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్‌లో గతంలో మెలిసా మేరీ కర్టిస్ అనే మహిళ టీచరుగా పని చేసింది. గత 2015లో అదే పాఠశాలలో ఎనిమిదో గ్రేడ్ చదువుతున్న 14 యేళ్ల బాలుడిని తన దారికి తెచ్చుకుని శృంగారంలో పాల్గొంది. అపుడు ఆమెకు 22 సంవత్సరాలు. ఈ క్రమంలో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో కర్టిస్ తనతో బలవంతంగా శృంగారంలో పాల్గొందని బాధిత విద్యార్థి ఆరోపణలు చేశాడు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కర్టిస్ విద్యార్థితో పాడు పనికి పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి, గంజాయి ఇచ్చి టీచర్‌ కర్టిస్ శృంగారంలో పాల్గొన్నట్టు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. దీంతో అక్టోబరు 31వ తేదీన అరెస్టు వారెంట్ జారీ చేశామని, సదరు మాజీ టీచరుపై పలు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధిత విద్యార్థులు వుంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారం రోజులుగా తగ్గుతున్న బంగారం - వెండి ధరలు