Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ - ఇక నుంచి నామినేషన్ల ఘట్టం

Telangana Assembly Elections
, శుక్రవారం, 3 నవంబరు 2023 (18:59 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. 
 
శుక్రవారం ఉదయం పది గంటల నుంచి అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద దాఖలు చేయవచ్చు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆదివారం 5వ తేదీన సెలవు దినం కావడంతో ఆ ఒక్కరోజు మాత్రమే నామినేషన్లను స్వీకరించరు.
 
అక్టోబర్ 31వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు ముందుగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెల 30న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగతా చోట్ల ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. 
 
ఇప్పటికే రెండువేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందని, ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల యువత ఓటు హక్కును నమోదు చేసుకుందన్నారు.
 
అంతర్రాష్ట్ర సరిహద్దు అంశాలపై ఢిల్లీ నుంచి సీఈసీ సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు అంశాలపై సమీక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాజాపై నిఘా డ్రోన్‌లను ఎగురవేస్తోన్న అమెరికా