Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భవిష్యత్ మ్యూజియంలు, హెరిటేజ్ ల్యాండ్‌మార్క్‌ల నుండి దుబాయ్ గొప్ప ఇండోర్ అద్భుతాలను వీక్షించండి

image
, శుక్రవారం, 7 జులై 2023 (17:02 IST)
దుబాయ్ రెండు ప్రపంచాలలో అత్యుత్తమమైన వాటిని అందిస్తుంది; ఇది ఆరు బయట అద్భుతాలకు మాత్రమే ప్రసిద్ధి చెందినది కాదు, ఇండోర్ కార్యకలాపాల పరంగానూ ప్రత్యేకతలను చూపుతుంది. వేసవిని పూర్తిగా  సద్వినియోగం చేసుకోండి మరియు నగరంలో అస్సలు వదులుకోలేనట్టి ఇండోర్ కార్యకలాపాలలో మునిగిపోండి. మీ తదుపరి పర్యటన కోసం దుబాయ్‌లోని కొన్ని ఆకర్షణీయమైన ఇండోర్ వేదికలను ఇక్కడ ఒకసారి పరిశీలించండి...
 
డిజిటల్ ఆర్ట్ థియేటర్: కళ, సాంకేతికత మరియు మల్టీమీడియాను కలిపే ఈ అద్భుతమైన సాంస్కృతిక ఆకర్షణతో లీనమయ్యే దృశ్య అనుభవాలను పొందడానికి  మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఇది పిల్లలతో సహా అన్ని వయసుల వారికి తగిన ప్రదేశం. థియేటర్ ఆఫ్ డిజిటల్ ఆర్ట్ దాని లీనమయ్యే ఎగ్జిబిషన్‌లు, ఇంటరాక్టివ్ ఇన్‌స్టాలేషన్‌లు మరియు విభిన్న కళాత్మక రూపాల కలగలుపుతో అన్ని వర్గాల వారినీ  ఆకర్షిస్తుంది మరియు ప్రేరేపిస్తుంది.  కళా ప్రేమికులు , సాంకేతికత అభిమానులు మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభవాలను కోరుకునే వ్యక్తులు తప్పనిసరిగా దీనిని సందర్శించాలి.
 
లా పెర్లే షో: మీరు ఉత్కంఠభరితమైన విన్యాసాలు, అత్యాధునిక సాంకేతికత మరియు థ్రిల్లింగ్ యాక్షన్‌ను ఆస్వాదించినట్లయితే, మీరు లా పెర్లే బై డ్రాగన్‌లో ఖచ్చితంగా  సీటును రిజర్వ్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం అద్భుతమైన రీతిలో 450 ప్రదర్శనలతో, ఇది దుబాయ్ యొక్క మొదటి శాశ్వత ప్రదర్శనగానూ నిలిచింది.  ఈ 90 నిమిషాల కాన్సర్ట్ లో టైమ్ ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉండండి.
 
టాప్ గోల్ఫ్ - టాప్ గోల్ఫ్ అనేది ఎమిరేట్స్ గోల్ఫ్ క్లబ్‌లోని మూడు-అంచెల  వినోద వేదిక, ఇది రూఫ్ టాప్  టెర్రస్‌తో 60,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఇది ఇంటరాక్టివ్ గోల్ఫ్ గేమ్‌లు, లైవ్ మ్యూజిక్, డైనింగ్‌లను అందిస్తుంది.
 
మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ - ఇది పుస్తక ప్రియులందరికీ ప్రీతిపాత్రమైనది. దుబాయ్‌లోని మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ ఆవిష్కరణ మరియు పర్యావరణ అనుకూలత కు నిదర్శనం. ఇక్కడ తొమ్మిది లైబ్రరీలు ఉన్నాయి. ఈ ఆకర్షణీయమైన ఇండోర్ రత్నాలను చూడడం ద్వారా దుబాయ్‌లో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తెకు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ