Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుర్రపిల్ల నా కూతురు కావాలంటే 'ఆ' షరతులు అంగీకరించాల్సిందే.. బాలీవుడ్ హీరోయిన్

అమృతా సింగ్. ఒకప్పటి బుల్లితెర, వెండితెర నటి. ఈమె నటనకు దూరమై సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి సారా అలీఖాన్ అనే కుమార్తె ఉంది. ఈమెను వెండితెరకు పరిచయం చేసేందుకు అమృత ఉత్సాహం చూపుతోంది.

కుర్రపిల్ల నా కూతురు కావాలంటే 'ఆ' షరతులు అంగీకరించాల్సిందే.. బాలీవుడ్ హీరోయిన్
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (16:02 IST)
అమృతా సింగ్. ఒకప్పటి బుల్లితెర, వెండితెర నటి. ఈమె నటనకు దూరమై సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి సారా అలీఖాన్ అనే కుమార్తె ఉంది. ఈమెను వెండితెరకు పరిచయం చేసేందుకు అమృత ఉత్సాహం చూపుతోంది. అయితే, ఆమె స్క్రీన్ లుక్ విషయంలో మాత్రం పలు పరిమితులు పెడుతోంది. ఇంకా సారాను తెరకు పరిచయం చేయకముందే.. ఒప్పంద పత్రాల మీద సంతకాలు కాకముందే.. అమృత పెడుతున్న షరతులతో నిర్మాతలే కాదు.. హీరోలు సైతం బిత్తరపోతున్నారట. 
 
అవతల చాలా మంది హీరోయిన్లు దూసుకుపోతున్న రూటులో కూతురిని ప్రోత్సహించడం లేదు ఈ మాజీ హీరోయిన్. ఈ రోజుల్లో హీరోయిన్లు బికినీలు వేయడం చాలా చాలా కామన్. కేవలం సినిమాల్లోనే కాదు... సోషల్ మీడియాలో కూడా బోలెడన్ని బికినీ పోజులను ఫొటోలుగా పోస్టు చేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి ఏజైన హీరోయిన్లు కూడా బికినీ స్టిల్స్ ఇచ్చేస్తున్నారు. 
 
అయితే, అమృతా సింగ్ మాత్రం... కుమార్తె విషయంలో బికినీధారణకు షరతు పెడుతోందట. సారాను బికినీలో చూపడానికి వీల్లేదని ఈమె స్పష్టం చేస్తోందట. ప్రస్తుతం సారా అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి చర్చలు జరుగుతున్న దశలో, కరణ్ జోహార్ సినిమాతో సారా తెరకు పరిచయం కానున్నదనే వార్తల నేపథ్యంలో అమె షరతులు ఆసక్తికరంగా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఇంజనీర్ బాబు".. ‘ఇంటి పేరు – ఒంటి పేరు అంతా ఇదే…’ అంటున్న పవన్ కళ్యాణ్