బయోపిక్‌లో జాన్వీ కపూర్..?

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె పైలెట్‌గా నటించనుంది. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. త

గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:02 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె పైలెట్‌గా నటించనుంది. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. తాజాగా జాన్వీకపూర్ ఓ బయోపిక్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకునే సినిమాలో జాన్వీ కీలక పాత్రలో కనిపించనుందట. 
 
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఎఎఫ్) విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా దర్శకనిర్మాత కరణ్‌జోహర్ ఓ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో గాయపడిన భారతీయ సైనికులను మరో మహిళా పైలెట్ శ్రీవిద్య రంజన్‌తో కలిసి గుంజన్ సక్సేనా ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
ఈ మహిళా పైలెట్ సాహసోపేత గాథను ఆవిష్కరిస్తూ రూపొందనున్న సినిమాలో గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీకపూర్ నటించనున్నట్లు సమాచారం. పాత్ర తీరుతెన్నుల కోసం ఇటీవలే గుంజన్‌ను, జాన్వీ కలిశారని సమాచారం. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

తర్వాతి కథనం మ‌హేష్‌... అల్ల‌రి న‌రేష్‌కి వార్నింగ్ ఇచ్చాడా..?