గీత గోవిందం హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటుందా.. ఎందుకు?

రష్మిక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే ప్రేమలో పడింది. ప్రేమలో పడిన సెలబ్రిటీతోనే నిశ్చితార్థం జరుపుకుంది. ఇప్పుడు ఆమె పెళ్ళికి రెడీ అవుతోందా. గీత గోవిందం బ్యూటీ ఇక సినిమాలకు గుడ్ బై చెబుతుందా. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరూ ఆమె అందానికి ఫిదా అయ్యారు.

శనివారం, 8 సెప్టెంబరు 2018 (18:03 IST)
రష్మిక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే ప్రేమలో పడింది. ప్రేమలో పడిన సెలబ్రిటీతోనే నిశ్చితార్థం జరుపుకుంది. ఇప్పుడు ఆమె పెళ్ళికి రెడీ అవుతోందా. గీత గోవిందం బ్యూటీ ఇక సినిమాలకు గుడ్ బై చెబుతుందా. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరూ ఆమె అందానికి ఫిదా అయ్యారు. గీత పాత్రలో అందరినీ మెస్మరైజ్ చేసింది బ్యూటీ రష్మిక. ఆ అందాల భామ పెళ్ళి ఆల్రడీ ఫిక్సయిందంటే చాలామంది నమ్మడం లేదు. రష్మికకు ఇప్పటికే పెళ్ళి ఫిక్సయ్యింది. రష్మిక పెళ్ళి గురించి సినీ పరిశ్రమలో పుకార్లు, షికార్లు చేశాయి. 
 
పెళ్ళికాక ముందే రష్మిక ఒక దర్శకుడితో ప్రేమలో పడింది. నిశ్చితార్థం కూడా చేసుకుంది. గీత గోవిందం సినిమా హిట్ కావడం, నాని సరసన దేవదాసులో నటిస్తుండటం, మరిన్ని సినిమాలు టాలీవుడ్‌లో సైన్ చేస్తుండటంతో ఆమె పెళ్ళి గురించి, నిశ్చితార్థం గురించి పుకార్లు మొదలయ్యాయి. అయితే తాను సైన్ చేసిన సినిమాలన్నీ పూర్తయిన వెంటనే సినిమాలకు గుడ్ బై చెప్పి హౌస్ వైఫ్‌గా ఉండిపోవాలన్న ఆలోచనలో ఉందట రష్మిక. ఇదే జరిగితే తెలుగు సినీపరిశ్రమకు మరో హీరోయిన్ దూరమయ్యే అవకాశముంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

LOADING