Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేరుకు సూపర్ స్టార్.. సాయంలో పిసినారి రజినీ.. లారెన్స్ రూ.కోటి విరాళం

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది సినీ నటీనటులు తమకు తోచినవిధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే, దక్షిణ భారతదేశంలో అత్యధిత పారితోషికం తీసుకునే హీరోగా గుర్తింపు పొందిన తమిళ సూపర్ స్టార్ రజినీ

పేరుకు సూపర్ స్టార్.. సాయంలో పిసినారి రజినీ.. లారెన్స్ రూ.కోటి విరాళం
, గురువారం, 23 ఆగస్టు 2018 (12:56 IST)
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది సినీ నటీనటులు తమకు తోచినవిధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే, దక్షిణ భారతదేశంలో అత్యధిత పారితోషికం తీసుకునే హీరోగా గుర్తింపు పొందిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం పిసినారిగా ముద్రవేయించుకున్నాడు. కేరళ వరద బాధితుల కోసం ఆయన కేవలం రూ.15 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈయన కంటే చిన్న హీరోలు... అతి తక్కువ పారితోషికం తీసుకునే హీరోలు, నటీమణులు మాత్రం రెట్టింపు విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇదే అంశం ఇపుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
 
కేరళ బాధితుల కోసం తొలుత హీరో సూర్య ఆయన కుటుంబ సభ్యులు కలిసి రూ.25 లక్షల సాయం ప్రకటించారు. ఆ తర్వాత చియాన్ విక్రం రూ.35 లక్షలు ఇవ్వగా, విశ్వనటుడు కమల్ హాసన్ రూ.25 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత ఇళయదళపతి విజయ్ తన అభిమాన సంఘాలతో కలిసి రూ.70 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఇలా మ‌ల్టీ టాలెంట్‌తో ఉన్న‌త స్థాయిలో ఉన్న‌ రాఘవ లారెన్స్ కేవ‌లం సినిమాలతోనే కాదు సామాజిక సేవలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు అండగా ఉండే లారెన్స్ ఆ మ‌ధ్య‌ ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి రూ.15 లక్షలు సాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వందలాది మంది చిన్నారుల‌కి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారు. 
 
తాజాగా కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కి ఏకంగా కోటి రూపాయాల సహాయార్థం ప్రకటించి తనలోని గొప్ప మనసును చాటిచెప్పాడు. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుండి ఇదే అత్యధిక విరాళం కావడం గమనార్హం. ఈ మొత్తాన్ని వచ్చే శనివారం ముఖ్యమంత్రి విజయన్‌ను కలిసి అందజేయనున్నాడు. అంతేకాకుండా, మరిన్ని పనులు చేసేందుకు బాధిత ప్రాంతాల్లో ఒకదాన్ని తనకు అప్పగించాల్సిందిగా తన ట్విట్టర్ ఖాతాద్వారా విజ్ఞప్తి చేశారు. 
 
అంతేకాకుండా, విప‌త్తు వల్ల నిరాశ్ర‌యుల‌ైన సోద‌ర‌, సోద‌రీమ‌ణులు త్వ‌ర‌గా కోలుకుని కేరళ రాష్ట్రం త్వరగా పునర్నిర్మాణం జ‌రుపుకోవాల‌ని ఆ రాఘ‌వేంద్ర స్వామిని కోరుకుంటున్న‌ట్టు లారెన్స్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేటింగ్ చేసిమరీ కాబోయే భర్తను ఓకే చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్.. ఎవరు?