Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక్కడ #MeToo కి స్థానం లేదు... అల్లు అర్జున్ ఏమన్నారంటే...?

ఇక్కడ #MeToo కి స్థానం లేదు... అల్లు అర్జున్ ఏమన్నారంటే...?
, సోమవారం, 12 నవంబరు 2018 (20:34 IST)
టాక్సీవాలా ప్రి-రిలీజ్ ఈవెంట్లో స‌ద‌ర‌న్ స్టార్ అల్లు అర్జున్ మ‌ట్లాడుతూ... ఈ సినిమాకి రైట‌ర్‌గా ప‌నిచేసిన సాయిగారికి ముందుగా కృత‌జ్ఞ‌త‌లు. ఎందుకంటే మ‌న క‌ల్చ‌ర్‌ని ముందుకు తీసుకువెళ్లేది లిట‌రేచ‌ర్ మాత్ర‌మే. రైట‌ర్స్ చాలా క‌ష్ట‌ప‌డ‌తారు కాని లీస్ట్ ఐడెంటిటీ వ‌స్త‌ది. కాని నేను అంద‌రికీ చెప్పేది ఫ‌స్ట్ అంద‌రూ రైట‌ర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ సినిమాకి ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ పేరు పేరునా ప్ర‌తి ఒక‌ళ్ళ‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. ఐ విష్ ఆల్ ద బెస్ట్‌. విజ‌య్ నీ డ్ర‌స్ అదిరిపోయింది. ఈ సినిమాలో ప‌ని చేసిన ప్రియాంక... క్ర‌ష్ ఉంద‌ని చెప్పావు నేనేమి చెయ్య‌లేను ఇప్పుడు చెప్పి ఏం లాభం. ప్రియాంక మ‌రాఠీ అమ్మాయి కాని అనంత‌పురంలో పెరిగింది. తెలుగుత‌నాన్ని ఇష్ట‌ప‌డేవారు ఎవ‌రైనా తెలుగువారే మ‌న తెలుగు అమ్మాయే. 
 
నేను నా త‌మ్ముడు MeToo గురించి వ‌చ్చిన‌ప్పుడు అనుకుంటాం... అమ్మాయిలు చెయ్యాలి క‌ష్ట‌ప‌డాలి అని. చాలా క్లీన్‌ అండ్ మంచి ఇండ‌స్ట్రీ అంటే అది తెలుగు ఇండ‌స్ట్రీయే. మీరు హీరోయిన్స్‌ని అడ‌గండి తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్‌కి రెస్పెక్ట్ ఉంటుంది. ప్రొడ్యూస‌ర్స్ గురించి చెప్పాలంటే ఎస్‌కెఎన్ చాలా హార్డ్‌ మెగా అభిమాని. చిన్నచిన్న‌గా క‌ష్ట‌ప‌డుతూ చాలా మంచిగా ఈ రోజు ప్రొడ్యూస‌ర్ స్థాయికి ఎదిగిన వ్య‌క్తుల్లో ఎస్‌కెఎన్ ఒక‌రు. ఎస్‌కెఎన్ ఐ యామ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. త‌ను ఆఫీస్‌కి వ‌చ్చి. బాబు ప్రీ రిలీజ్‌కి రావ‌డానికి మీకేమైన అభ్యంత‌ర‌మా అని అడిగాడు. అభ్య‌త‌రం ఏముంట‌ది అంటే. విజ‌య‌ దేవ‌ర‌కొండ ఫంక్ష‌న్‌కి ఒక‌సారి వ‌చ్చారు క‌దా అన్నాడు. 
 
ఇష్ట‌మైన పనికి రావ‌డం క‌ష్టం కాదు. విజ‌య‌ దేవ‌ర‌కొండ స్టైల్లో చెప్పాలంటే న‌చ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్‌కొట్ట‌దు. విజ‌య్‌ సింగిల్ బాయ్స్ మీద జోక్స్ వేస్తే ప్రాబ్ల‌మ్స్ ఉండ‌వు. యువి పిక్చ‌ర్స్ నాకు చాలా న‌చ్చిన ప్రొడ్యూస‌ర్స్‌. నేను పిలిచి మ‌రీ మ‌నిద్ద‌రం క‌లిసి సినిమా తీస్తే బావుంట‌ుంద‌ని అడిగిన ఏకైక ప్రొడ్యూస‌ర్స్‌. నా సొంత మ‌నిషి బ‌న్నీ వాసు, ఎస్‌కెఎన్ ఇద్ద‌రూ ప్రొడ్యూస‌ర్స్‌గా వ‌చ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఎవ‌రైనా స‌రే నా ముందు ఎదిగితే నాకు చాలా సంతోషం. ఈ రోజు ట్రిపుల్ ఆర్ ఆర్ ఫిల్మ్ లాంచ్ అయింది. నా ఫేవ‌రెట్ మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌కి, నేను స‌ర‌దాగా పిలుస్తాను జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని బావా అని, నా బావ‌కి, ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా రాజ‌మౌళి గారికి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్‌. 
 
విజ‌య్ నెక్ట్స్ టైం నీ ఈవెంట్‌కి నాకు ఒక మంచి డ్ర‌స్ డిజైన్ చేసిపెట్టాలి. ఓకేనా... త‌ప్ప‌కుండా నేనే చేస్తాను మీకు డిజైన్ అని విజ‌య‌ దేవ‌ర‌కొండ అన్నారు. నువు చాలా మంచి డాన్స‌ర్. విజ‌య్ ద‌గ్గ‌ర ఒరిజినాలిటీ ఉంటుంది. అది జ‌నాల‌కి న‌చ్చింది. విజ‌య్ ఈజ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మ‌ర్. మేమంద‌రం ఒక గోల్డెన్ ప్లేట్ నుంచి వ‌చ్చాం. త‌ను ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నుంచి స్టెప్ బై స్టెప్ చాలా క‌ష్ట‌ప‌డుతూ ఎదుగుతూ వ‌చ్చారు. నేను ఎంత పెద్ద యాక్ట‌ర్ అయినా కావొచ్చు కాని ఐ నెవ‌ర్ మేడ్ సెల్ఫ్‌. త‌ను చెక్కుకున్న శిల్పం త‌ను. నేను టాలెంట్ ఉన్న‌వాళ్ళ‌ మీద జోక్స్ వెయ్య‌లేను. ఇష్ట‌ముండ‌దు. సొసైటీలో ఎంత ఎదిగితే అంత నెగిటివిటీ కూడా ఒక్కోసారి వ‌స్తుంది. 
 
విజ‌య్ నువ్ అవేమి ప‌ట్టించుకోవ‌ద్దు. ఐ రియాల్లీ ఎంజాయ్ యువ‌ర్ స‌క్సెస్‌. ఒక సినిమాకి ఇంతమంది క‌ష్ట‌ప‌డ్డారంటే దాని వెనుక ఎన్ని జీవితాలున్నాయోనని ఆలోచించండి. ద‌య‌చేసి పైర‌సీని ఎంక‌రేజ్ చెయ్య‌కండి. థియేట‌ర్స్‌కి వెళ్లి సినిమాని చూడండి. థ్యాంక్యూ ఆల్ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

140 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తున్న ‘2.0’