Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టఫ్‌గా కనిపిస్తారు కానీ, మాట వింటారు. పర్వాలేదు...?

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత- వీర రాఘవ. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని తొలి లిరికల్ వీడియో ''అనగనగనగా'' సినీ బృంద

టఫ్‌గా కనిపిస్తారు కానీ, మాట వింటారు. పర్వాలేదు...?
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (18:06 IST)
ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత- వీర రాఘవ. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని తొలి లిరికల్ వీడియో ''అనగనగనగా'' సినీ బృందం శనివారం విడుదల చేసింది. ఈ వీడియో మొదట్లోనే ''టఫ్‌గా కనిపిస్తారు కానీ, మాట వింటారు. పర్వాలేదు'' అంటూ వీర రాఘవకు కితాబిస్తోంది అరవింద.
 
ఇక ఈ సినిమాలోని తొలి లిరికల్‌ వివరాల్లోకి వెళితే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్‌ బాణీలు అందించారు. ''చీకటిలాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా?'' అంటూ ఈ పాట సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ నెల 20న ఆడియో విడుదల వేడుకను నిర్వహించనున్నారు. 
 
జగపతిబాబు, సునీల్‌, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తారక్‌.. వీరరాఘవరెడ్డి అనే పాత్రలో చిత్తూరు కుర్రాడిగా, రాయలసీమ యాసలో మాట్లాడతారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకీ రాముడు’