Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనకు, అమెరికాకు సినిమా నిర్మాణంలో ఎంత తేడానో తెలుసా!

shooting spot

డీవీ

, మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (19:09 IST)
shooting spot
తెలుగు సినిమా కానీ టీవీ సీరియల్ కానీ షూటింగ్ జరిగితే మన దగ్గర నటీనటులకుకానీ, టెక్నీషియన్స్ కు కానీ పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం వుంటుంది. లీడ్ ఆర్టిస్టులకు, టెక్నీషియన్ కు చాలా వ్యత్యాసం వుందని స్పష్టం అయింది. ఇక్కడ సినిమా షూటింగ్ లో పాల్గొనే వారికి డైలీవేజెస్ కింద ఖర్చులకు కన్వెన్స్ కింద బైక్ లో లొకేషన్ కు వస్తే 200 , కారులో వస్తే 500 ఇవ్వడం జరుగుతుంది. ఇక అసలు పేమెంట్ ఇవ్వాల్సి వస్తే నెలల తరబడి నిర్మాణ సంస్థ నుంచి పారితోషికం రాదు. ఇక పనిగంటలు కూడా పది గంటలు పైగా చేయాల్సి వుంటుంది.
 
కానీ విదేశాల్లో షూటింగ్ వుంటే, ప్రతి వారికి ముందుగానే అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత షూటింగ్ అయిన వెంటనే పేమెంట్ ఇస్తారు. కొందరు వీకెండ్ లో తీసుకుంటారు. ఇక పనిగంటలు కేవలం ఎనిమిది గంటలే. అందుకే బహుముఖం సినిమా షూటింగ్ పూర్తిగా అమెరికాలో చేశామనీ, మనదగ్గర నెలలతరబడి పేమెంట్ లు రావని తెలుసుకుని ఆశ్చర్యపోయాయనని హీరో, నిర్మాత, దర్శకుడు హర్షివ్ కార్తీక్ తెలియజేయడం విశేషం. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా వింత విషయాలు తెలుసుకున్నానని అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాస్ ఐలాండ్, అబుదాబి లో జరుగనున్న సినిమాటిక్ వైభవం ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024