Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంటే సుందరానికిలో రంగో రంగా అంటోన్న నాని

ante Sundaraniki, Nani
, సోమవారం, 23 మే 2022 (17:42 IST)
ante Sundaraniki, Nani
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి'. నజ్రియా ఫహద్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
 
సినిమా కథ చెప్పడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయది ప్రత్యేకమైన శైలి. కథ చెప్పడంలోనే ఆయనకి మంచి సంగీతం అభిరుచి కూడా వుంది. ఆయన సినిమాల్లోని పాటలు డిఫరెంట్‌గా ఉంటూ ఒక్కో పాట డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి కనెక్ట్ అవుతుంది.
 
వివేక్ సాగర్ స్వరపరిచిన 'అంటే.. సుందరానికీ' ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ 'రంగో  రంగా' పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కథలో సుందరం పాత్ర పరిస్థితిని హిలేరియస్ గా ప్రజంట్ చేసింది. సంగీత దర్శకుడు ఈ పాటని చాలా డిఫరెంట్ గా కంపోజ్ చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు అందించిన సాహిత్యం క్యాచిగా వినోదాత్మకంగా వుంది.  
♪♪ అనుకున్నదోటి  
అయ్యిందోటి
రంగో రంగా..
మొక్కిందోటి..  దక్కిందోటి .. అంటూ సాగే పాట  పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం, నాని ఎక్స్ ప్రెషన్స్ హిలేరియస్ గా వున్నాయి. కారుణ్య ఈ పాటను చాలా ఎనర్జిటిక్ గా ఆలపించారు. పాటలో సెట్స్ జరిగిన సరదా విజువల్స్ చూపించడం ఆకట్టుకుంది.
మొదటి రెండు పాటల్లానే రంగో రంగా పాట కూడా  ఇన్స్టంట్ సూపర్ హిట్ గా నిలిచింది.
 
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు.  
 
ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
 
తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సిఈవో: చెర్రీ
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్, భాను

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు అందుకున్న నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి