Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్‌లో ఓటింగ్ అక్రమాలా? ఎలా సాధ్యం..?

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌. తెలుగులో గత ఏడాది మొదటి సీజన్‌ జరిగితే… ప్రస్తుతం రెండో సీజన్‌ నడుస్తోంది. ఈ సీజన్‌ కూడా ఇంకో రెండు వారాల్లో ముగియనుంది

బిగ్ బాస్‌లో ఓటింగ్ అక్రమాలా? ఎలా సాధ్యం..?
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (20:24 IST)
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌. తెలుగులో గత ఏడాది మొదటి సీజన్‌ జరిగితే… ప్రస్తుతం రెండో సీజన్‌ నడుస్తోంది. ఈ సీజన్‌ కూడా ఇంకో రెండు వారాల్లో ముగియనుంది. ఈ షో చూస్తున్నవారికి దీని కాన్సెప్ట్‌ ఏమిటో తెలుసు. ఇంట్లోకి 16 – 20 మందిని పంపుతారు. ఆ తరువాత ఒక్కోవారం ఒకొక్కరిని ఎలిమినేట్‌ చేస్తూ ఇంటి నుంచి బయటకు పంపుతారు. ఇది ప్రేక్షకుల ఓటింగ్‌ ద్వారా జరుగుతుంది. ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్లు ఇంటిని వదిలి వెళ్లిపోవాలి.
 
బిగ్‌బాస్‌ ఇంటిలోని సభ్యులకు బయట ఓట్లు సమకూర్చి పెట్టడానికి కొన్ని సంస్థలు వెలిశాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఒట్టి ఆరోపణే కాదు. ఇంటి సభ్యులే ఇటువంటివి ఉన్నాయని అంగీకరిస్తున్నారు. కౌశల్‌ తరపున కౌశల్‌ ఆర్మీ పేరుతో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియా వేదికగా కౌశల్‌ ఆర్మీ ఓట్ల కోసం ప్రయత్నిస్తోంది. బయట కాలేజీలకు వెళ్లి ఓట్లు వేయమని కోరుతోంది. 
 
కౌశల్‌ ఆర్మీ గురించి ఇంటి సభ్యులైన గీతా మాధురి, దీప్తి మాట్లాడుకున్నారు. దీనిపైన నాని గీతను ప్రశ్నించారు. కౌశల్‌ ఆర్మీ గురించి మీకెలా తెలుసునని నిలదీశారు. నూతన్‌ నాయుడు రెండోసారి ఇంట్లోకి వచ్చినపుడు చెప్పారని ఆమె వివరణ ఇచ్చారు.
 
ఇదే సమయంలో ఆమె మరో వాస్తవాన్ని వెల్లడించారు. తాను బిగ్‌బాస్‌కు ఎంపికైన విషయం తెలుసుకుని ఎవరో ఫోన్‌ చేశారని చెప్పారు. ‘మీరు బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్నప్పుడు మీకు బయట ఓట్లు సంసాదించిపెడుతాం’ అని ఆ వ్యక్తులు తనను కోరారని గీతా మాధురి వివరించారు. అంటే ఇంటి సభ్యులకు ఓట్లు సంపాదించడం కోసం బయట కొన్ని సంస్థలు పట్టుకొచ్చాయన్నది గీత మాటలతో రుజువయింది. ఇటువంటి ఏర్పాట్లు లేనివారికి ఓట్లు లభించడం కష్టంగా మారుతోంది.
 
బిగ్‌బాస్‌ ఓటింగ్‌ విధానం కూడా అక్రమాలకు అనుకూలంగా ఉంది. ఒక్కో వ్యక్తి రోజుకు 50 ఓట్లు వేయొచ్చు. వారమంతా వేయొచ్చు. అంటే ఒక వ్యక్తి రోజుకు 350 ఓట్లు వేయొచ్చన్నమాట. ఇక ఎన్ని సెల్‌ఫోన్లు ఉంటే అన్ని 350 ఓట్లు వేయొచ్చు. మిస్డ్ కాల్‌ పద్దతిలో వేసి, గూగుల్‌లోని వెబ్‌సైట్‌ ద్వారానూ వేయొచ్చు. కొందరు వ్యక్తులు అదే పనిగా మనుషులను పెట్టి ఈ పద్ధతిలో ఓట్లు వేయిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లేవారు బయట ఓట్లును కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే తప్ప గెలిచే అవకాశం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ‌లో గురు ప్రేమ కోస‌మే.. చాలా హాట్‌గా ఉంది..!