Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్-2 : కౌశల్‌కు మద్దతుగా 2కే ర్యాలీ.. భారీగా వచ్చిన ఫాలోయర్లు...

బిగ్‌బాస్-2 సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌లలో ఒకరు కౌశల్. ఈయన ఎలిమినేషన్ జోన్‌కు వచ్చినపుడల్లా కౌశల్ ఆర్మీ ఆయన్ను కాపాడుతూ వస్తోంది. అయితే, ఈ సైన్యం అంతా ఉత్తుత్తిదేనంటూ జోరుగా ప్రచారం జరిగింది.

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (14:02 IST)
బిగ్‌బాస్-2 సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌లలో ఒకరు కౌశల్. ఈయన ఎలిమినేషన్ జోన్‌కు వచ్చినపుడల్లా కౌశల్ ఆర్మీ ఆయన్ను కాపాడుతూ వస్తోంది. అయితే, ఈ సైన్యం అంతా ఉత్తుత్తిదేనంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో దీన్ని నిజం చేసేందుకు ఆదివారం ఉదయం ఉదయం కౌశల్ ర్యాలీ పేరుతో 2కే రన్‌ను నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 2 వేల మందికిపైగా ఆయన ఫ్యాన్స్ పాల్గొన్నారు.
 
నిజానికి కౌశల్ ఎప్పుడు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చినా, ఈ ఆర్మీ భారీగా ఓట్లు వేసి, ఆయనను సేఫ్ జోన్‌లోకి తీసుకెళుతోంది. కౌశల్‌కు అభిమానులుగా ఉన్న వారు ర్యాలీలో పాల్గొనాలని శనివారం సోషల్ మీడియా ద్వారా కౌశల్ ఆర్మీ పిలుపునివ్వగా, ఆదివారం ఉదయం మాదాపూర్‌లో జరిగిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. 
 
అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లల తల్లులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంకోసారి తమది పెయిడ్ ఆర్మీ అంటే ఊరుకోబోయేది లేదని ర్యాలీకి వచ్చిన వారు హెచ్చరించడం గమనార్హం. దీంతో కౌశల్‌కు ఇంత రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? అన్న కొత్త చర్చ మొదలైంది. 

సంబంధిత వార్తలు

ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే "ఆడబిడ్డ" నిధి ఇస్తాం.. చంద్రబాబు

చిన్నాన్న అంటే అర్థం తెలుసా అన్నా జగన్... హంతకులకు ఓటు వేయొద్దు : సునీత

గానుగ నూనె వర్సెస్ రిఫైన్డ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏ వంట నూనె మంచిది, వైద్యులు ఏమంటున్నారు?

టైటానిక్ సినిమాలో రోజ్‌ ప్రాణాలను కాపాడిన తలుపు చెక్కకు వేలంలో రూ. 6 కోట్లు

మద్యం మత్తులో మైనర్‌పై అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి..?

సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

వేసవిలో కీరదోస తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అవకాడో పండుతో 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

యవ్వనంగా ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటి?

సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ 8 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments