Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేగువేరా బ‌యోపిక్ చే చిత్రం నా 20 ఏళ్ల క‌ల : బిఆర్ సభావత్ నాయక్

producer surya - janasena aruna -br sabavath naik
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (16:31 IST)
producer surya - janasena aruna -br sabavath naik
“9వ త‌ర‌గ‌తిలోనే ప్ర‌పంచ విప్ల‌వానికి ఐకాన్‌గా నిలిచే చేగువేరా గురించి తెలుసుకున్నాను. అప్ప‌టి నుంచి ఒక‌టే క‌ల. ఆయ‌న బ‌యోపిక్ సినిమాగా తీయాల‌ని. డ‌బ్బులు లేవు, స‌పోర్టు లేదు. తోపుడు బండిపై చిన్నచిన్న తినుబండారాలు అమ్ముతూ పైసా పైసా కూడ‌బెట్టాను. నా అణువ‌ణువూ చేగువేరా. ల‌క్ష్యం, సంక‌ల్పం ఒక్క‌టే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు చేగువేరాను మ‌ధ్య‌మ‌ధ్య‌లో నాకు ప‌రోక్షంగా గుర్తు చేస్తున్న స‌మ‌యంలో నా లక్ష్యం మ‌రింతా బ‌ల‌ప‌డింది.

20 ఏళ్ల శ్ర‌మ ఫ‌లించింది. ఆయ‌న గౌర‌వం ఏమాత్రం త‌గ్గకుండా చేగువేరా బ‌యోపిక్ “చే” సినిమాను తీశాను. సినిమా ప్ర‌చార చిత్రాల‌ను చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా స్వ‌యంగా విడుద‌ల చేసి మా చిత్ర‌యూనిట్‌ను మ‌మ్మ‌ల్ని అభినందించడం మాకెంతో గ‌ర్వ‌కార‌ణం. సెన్సార్ వాళ్లు కూడా సినిమా చూసి ఇంప్రెస్ అయ్యారు. డిసెంబర్ 15న థియేట‌ర్‌ల‌లోకి చేగువేరా బ‌యోపిక్ “చే”ను విడుద‌ల చేస్తున్నాం..” అని అన్నారు రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్.
 
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం “చే” - లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. డిసెంబ‌ర్ 15న ఈ సినిమా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్ చేగువేరా లుక్‌లో రావ‌డం అంద‌రిని ఆక‌ర్షించింది.
 
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న జనసేన నాయకురాలు రాయపాటి అరుణ మాట్లాడుతూ... చేగువేరా బయోపిక్‌ను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సపోర్ట్ చేస్తారు. యువత ఇలాంటి సినిమాలను చూడాలి. చేగువేరా స్పూర్తితో, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి మాదిరిగా సామాన్యుల హక్కుల కోసం మ‌న‌మంతా పోరాటం చేయాలి. పెద్ద సినిమానా? చిన్న సినిమా అని చూడకుండా వ్య‌వ‌స్థ కోసం చూడాలి. ఎంట‌ర్‌టైన్మెంట్ కోసం కాకుండా స‌మాజం కోసం చూడాలి. ఈ సినిమాకు మా స‌పోర్టు ఉంటుంది.
 
సీనియర్ జర్నలిస్టులు ప్రభు, భరద్వాజ్, `మా` ఈసీ మెంబ‌ర్‌ మాణిక్, నటుడు, పబ్లిసిటీ డిజైనర్ వివారెడ్డి మాట్లాడుతూ... “చే” అంటేనే విజయం. ప్రపంచంలోనే ఏ దేశం వ్య‌క్తి అయినా గుర్తించే ముఖం చేగువేరాది. సభావత్ నాయక్‌ గారి మనోబలం గొప్పది. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది.” అన్నారు. 
 
'ప్రత్యర్థి' మూవీ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ... “ఇలాంటి బయోగ్రఫీ తీసుకురావడం అభినంద‌నీయం. ఒక పోరాట‌యోధుడిని ఆవిష్క‌రించిన సభావత్ నాయక్‌ గారి ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం ఈ సినిమా. ఈ సినిమాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి.” అన్నారు.
 
నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించిన‌ ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషించారు. రవిశంకర్ సంగీతం అందించారు. సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా వీరాంజనేయ పిక్చర్స్ సంస్థ ద్వారా 100 కు పైగా థియేటర్ లలో విడుదలకు సిద్ధ‌మైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ఆరోగ్య రహస్యం అదే! మూడు కాలాల్లో జరిగే కథ పిండం : కథానాయకుడు శ్రీరామ్