Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనీష్‌కు దీప్తి నల్లమోతు భర్త వార్నింగ్... కన్నీళ్లు పెట్టుకున్న తనీష్

ఈవారం లగ్జరీ బడ్జెట్లో భాగంగా.. ‘రిమోట్ కంట్రోల్’ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఏం చెప్తే అది చేయాలి... ఏ పరిస్థితులలో ఉన్నా రూల్స్‌ని అతిక్రమించరాదు... స్లో మోషన్, రివైండ్, ఫార్వర్డ్, ఫ్రీజ్ లాంటి పనులు ఏవి చెప్పినా వాటిని విధ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:02 IST)
ఈవారం లగ్జరీ బడ్జెట్లో భాగంగా.. ‘రిమోట్ కంట్రోల్’ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఏం చెప్తే అది చేయాలి... ఏ పరిస్థితులలో ఉన్నా రూల్స్‌ని అతిక్రమించరాదు... స్లో మోషన్, రివైండ్, ఫార్వర్డ్, ఫ్రీజ్ లాంటి పనులు ఏవి చెప్పినా వాటిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ముందుగా సామ్రాట్ తల్లి ఇంట్లోకి అడుగుపెట్టి అందరికీ పలకరించి ఆశీస్సులు అందజేసారు. తర్వాత అమిత్ భార్య, కొడుకు రాగానే అతని ముద్దుముద్దు మాటలు వింటూ హౌస్‌మేట్సంతా మైమరిచిపోయారు.
 
ఇక నెక్స్ట్ దీప్తి నల్లమోతు కొడుకు, వెంటనే ఆమె భర్త వచ్చారు. భర్త సలహాలను అందుకున్న ఆమె ఇకపై నమ్మకంతో విజయం సాధిస్తానన్నారు. ఆమె భర్త బిగ్ బాస్ హౌస్‌ని వదిలి వెళ్తున్నప్పుడు తనీష్‌తో మాట్లాడటానికి ట్రై చేసారు. కానీ సరిగ్గా అర్థం కాలేదు... చూసుకుని గేమ్ ఆడితే మంచిది అని తనీష్‌కి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్లుగా సలహా ఇచ్చారు. కారు టాస్క్‌లో దీప్తి నల్లమోతుతో తనీష్‌ ప్రవర్తించిన తీరు కారణంగానే ఇలా చెప్పారేమో దీప్తి భర్త.
 
ఇదయ్యాక సిగరెట్ రూమ్‌లో ఈ విషయాన్ని తలచుకుని తనీష్ కన్నీళ్లు పెట్టుకోగా, చూసి ఆడండి అనే కదా ఆయన అన్నారు, దీనికెందుకు బాధపడ్తున్నావు అంటూ ఓదార్చడానికి ప్రయత్నించారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments