Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ్యాపీడేస్ లా పాషన్ మూవీ కూడా యూత్ ని ఆకట్టుకోవాలి : శేఖర్ కమ్ముల

Passion movie team with Shekhar Kammula
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (16:22 IST)
Passion movie team with Shekhar Kammula
సుధీష్ వెంకట్, అంకిత సాహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పాషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్జ్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.  "పాషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు.

మంగళవారం హైదరాబాద్ లో "పాషన్" సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ దర్శకులు శేఖర్  కమ్ముల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా...దర్శకుడు వేణు ఊడుగుల ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువాకు అందజేశారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ఈ స్టోరీ రాయడం, దాన్ని నవలగా ప్రచురించడం, సినిమా తీసే ప్రయత్నం నాకు అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు అరవింద్. ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్ళతో తీసిన హ్యాపీడేస్ లా పాషన్ కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అన్నారు
 
నిర్మాత అరుణ్ మొండితోక మాట్లాడుతూ - ఎక్కడా కాంప్రమైస్ కాకుండా కేవలం కథని, దాన్ని హానెస్ట్ గా సినిమాగా తీయడాన్నే నమ్మిన డైరెక్టర్ అరవింద్. అదే సినిమాకి బలమని నమ్ముతున్నాం. త్వరలోనే మా సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్తాం. అన్నారు
 
దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ - పాషన్ నవల చదివాను. నాకు బాగా నచ్చింది మంచి వాక్యం, భావం ఉన్న రచయిత అరవింద్. డైరెక్టర్ గా కూడా అదే ప్రభావవంతమైన సినిమా తీస్తాడని ఆశిస్తున్నా. అన్నారు.
 
నిర్మాత ఏ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా స్క్రిప్ట్ నాకు నెరేట్ చేసినపుడు బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. అందుకే భాగస్వామిని అవుతున్నాను. అన్నారు.
 
దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ - సినిమా ఫలితం ఎలా ఉంటుందనే ఆలోచన లేకుండా కేవలం కథను నమ్మి మా ప్రొడ్యూసర్స్ అరుణ్, పద్మనాభ రెడ్డి గార్లు సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. వారికి నా థ్యాంక్స్ చెబుతున్నా. మేము అనుకున్న సబ్జెక్ట్ ను నిజాయితీగా తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తున్నాం. మా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి బ్లెస్ చేసిన మా గురువు శేఖర్ కమ్ముల గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి తోడుగా ఉంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి