పోలీసులను ఆశ్రయించిన ప్రీతీ జంగానియా... ఎందుకో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జంగానియా. 'తమ్ముడు', 'నరసింహా నాయుడు' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె సినీ కెరీర్ పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి... వైవాహిక జీ

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (16:37 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జంగానియా. 'తమ్ముడు', 'నరసింహా నాయుడు' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె సినీ కెరీర్ పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి... వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ముంబైలో నివసిస్తోంది. ఈమెకు ఓ కుమారుడు ఉన్నాడు. వయసు ఏడేళ్లు.
 
ఈ పరిస్థితుల్లో తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకున్నాడన్న కారణంతో పక్క అపార్ట్‌మెంట్‌లో నివాసముండే వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అపార్ట్‌మెంట్‌లో పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో పిల్లల మధ్య గొడవ జరగగా.. ఓ వృద్ధుడు తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకోవటంతో పాటు అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటివేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మొత్తంమీద చాలా కాలంగా మీడియాకు కనిపించని ప్రీతి.. కుమారుడు వివాదం కారణంగా మీడియా కంటికి కనిపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

LOADING