Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ విషయంలో నాకు 30 ఏళ్ల యువకుడికి వున్న పవర్ వుంది... నాగార్జున

నవ మన్మథుడు అక్కినేని నాగార్జున ఫిట్‌నెస్‌ రహస్యం ఏమిటో చెప్పారు. ఫిట్‌నెస్‌ అనేది శివ సినిమాతో మొదలయింది. అది నాజీవితంలో దినచర్యగా మారిపోయింది. స్నానం ఎలా చేస్తామో.. వ్యాయామమూ అంతే. అమల కూడా నాతో పాటు రోజూ వ్యాయామం చేస్తారు. ఎవరైనా తన శరీర బరువుకు మ

ఆ విషయంలో నాకు 30 ఏళ్ల యువకుడికి వున్న పవర్ వుంది... నాగార్జున
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (09:41 IST)
నవ మన్మథుడు అక్కినేని నాగార్జున ఫిట్‌నెస్‌ రహస్యం ఏమిటో చెప్పారు. ఫిట్‌నెస్‌ అనేది శివ సినిమాతో మొదలయింది. అది నాజీవితంలో దినచర్యగా మారిపోయింది. స్నానం ఎలా చేస్తామో.. వ్యాయామమూ అంతే. అమల కూడా నాతో పాటు రోజూ వ్యాయామం చేస్తారు. ఎవరైనా తన శరీర బరువుకు మించిన బరువు ఎత్తు కలిగితే… ఫిట్‌గా ఉన్నట్లు. నా బరువు 80 కిలోలు. నేను 140 కిలోల బరువు ఎత్తుగలను. అమలు 70 కిలోల దాకా ఎత్తుతుంది అంటూ రోజూ తాను వ్యాయామానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో వివరించారు నాగార్జున. 
 
30 ఏళ్లుగా నిర్విరామంగా వ్యాయామం చేస్తున్నాను. నా జీర్ణ వ్యవస్థ చాలా బాగా పని చేస్తుంది. 30 ఏళ్ల యువకుడిలో ఉన్న స్థాయిలో ఉంటుంది. సాధన చేస్తే ఎవరికైనా ఇది సాధ్యమే అని చెప్పారు. నటనలో కొడుకు చైతన్య, కోడలు సమంతలో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…. కోడలివైపే నిలబడ్డారు. ఇద్దరూ కష్టపడేవాళ్లే. క్రమశిక్షణగా పని చేస్తారు. చైతన్యతో పోల్చితే అమ్మాయిగా సమంత ఈ స్థాయికి చేరుకోవడం, స్టార్‌డమ్‌ తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే సమంతకే ఎక్కువ మార్కులు వేస్తా…. అని నాగార్జున విశ్లేషణాత్మక సమాధానం ఇచ్చారు. 
 
సమంత తనకు కూతురు వంటిదన్నారు. ప్రస్తుతం కొత్తదనంతో కూడిన కథలు తెరకెక్కుతున్నా… కుటుంబంతో కలిసి చూడగల చిత్రాలు రావడం లేదనే విమర్శపై స్పందిస్తూ… కుటుంబంతో కలిసి చూడలేని సినిమాలకు పిల్లల్ని తీసుకెళ్లండి. కుటుంబ కథలొచ్చినపుడే అందరూ కలిసి వెళ్లండి. అయినా ఇంటర్నెట్‌లో అన్నీ ఓపెన్‌గా ఉన్నాయి. దాన్ని ఎవరూ ఏమీ చేయలేకున్నారు. పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు. సినిమా వద్దకు వచ్చేసరికే హడావుడి చేస్తున్నారు. ఇదెక్కడి గొడవో నాకర్థం కావడం లేదని సూటిగా మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో తారా సుతారియా అవుట్.. కైరా అద్వానీకి ఛాన్స్