Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జితేందర్ రెడ్డి నుండి మంగ్లీ పాడిన లచ్చిమక్క పాటకు అనూహ్య స్పందన

Lacchimakka song scean

డీవీ

, శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (11:56 IST)
Lacchimakka song scean
ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 
 
ఇటీవలే విడుదల అయిన అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది, ముఖ్యంగా యువతకి ఆ పాట బాగా నచ్చింది.  ఆ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ కాగా ఇప్పుడు విడుదలైన ఈ ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది.  ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980' లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాట్యురల్ గా ఉన్నాయి. ఈ పాత ద్వార కథలో ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది
 
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ: ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరుకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా మంచి ఆదరణ పొందాయి. ప్రేక్షకులు కొత్త నిర్మాతలమైనా మన్నలిని ఇంత బాగా ఆదరిస్తున్నారు.  కంటెంట్ ఉంటె మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆ సినిమాని ఆదరిస్తారు అని మరో సారి నిరూపించారు. మంగ్లీ పాడిన లచ్చిమక్క పాటకు అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు. 
 ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా ఉంది ఈ జితేందర్ రెడ్డి. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఆర్పీ రేటింగ్‌ను కుమ్మేసిన గుంటూరు కారం..