Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగచైతన్య, సమంత ప్రేమే హాట్ టాపిక్.. నాగార్జున సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారా?

నాగచైతన్య, సమంత ప్రేమే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ప్రేమ విషయంలో సమంత తన ప్రియుడి పేరు చెప్పకుండా అతని గురించి అన్ని విషయాలు చెప్తోంది. సమంత సినిమాలు ఒప్పుకోవడం మానేయడంతో త్వరలోనే చైతన్యతో ప

నాగచైతన్య, సమంత ప్రేమే హాట్ టాపిక్.. నాగార్జున సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారా?
, గురువారం, 28 జులై 2016 (10:05 IST)
నాగచైతన్య, సమంత ప్రేమే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ప్రేమ విషయంలో సమంత తన ప్రియుడి పేరు చెప్పకుండా అతని గురించి అన్ని విషయాలు చెప్తోంది. సమంత సినిమాలు ఒప్పుకోవడం మానేయడంతో త్వరలోనే చైతన్యతో పెళ్లి కన్ఫామ్ అని వార్తలొస్తున్నాయి. చైతు మాత్రం తన పని పనిచేసుకుపోతుంటే సమంత తన పెళ్లి గురించి మాట్లాడడమే సరిపోతోందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.
 
సమంత చేస్తున్న పబ్లిసిటీ మాత్రం అక్కినేని ఫ్యామిలీకి చాలా ఇబ్బందిగా ఉందట. దాంతో నాగార్జున స్వయంగా సమంతని పిలిపించి సమయం వచ్చినప్పుడు తానే గ్రాండ్‌గా అనౌన్స్‌ చేస్తానని, అందాక సైలెంట్‌గా ఉండమని సున్నితంగా చీవాట్లు పెట్టారట. సమంత కూడా సరే అని సైలెంట్ అయ్యిందని సమాచారం.
 
ఇదిలా ఉంటే.. తాజాగా సమంత చేతి వేలికి నిశ్చితార్థానికి పెట్టుకునే ఉంగరం ఒకటి కనబడుతోంది. ఈ ఉంగరం చూసిన దగ్గర్నుంచి సినీ పిల్ల జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమంతకు నాగచైతన్యతో రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వారు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు నాగచైతన్య స్వయంగా తన ప్రియురాలు సమంత కోసం ఓ ప్లాటినమ్ ఉంగరం ఒకదాన్ని కొనితెచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచుకు నో చెప్పిన నటి... మంచు అంటే మరీ అంత ఇదా...?