Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వారికే.. ఆంధ్రా నిరుద్యోగులకు సున్నా...

తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకే కేటాయించనున్నారు. ఈ మేరకు కొత్త జోనల్ విధాన

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (15:08 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకే కేటాయించనున్నారు. ఈ మేరకు కొత్త జోనల్ విధానానికి కేంద్రంతో పాటు.. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇదే అంశంపై కేంద్రం కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
 
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. కొత్త జోనల్ విధానంపై కేంద్రం చెబుతున్న అభ్యంతరాలపై ప్రధాని నరేంద్ర మోడీకి వివరణ ఇచ్చారు. అంతేకాకుండా హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ కేసీఆర్ మాట్లాడారు. దీంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వ అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించింది.
 
ఫలితంగా ఈ కొత్త జోనల్ వ్యవస్థ కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. నూతన జోనల్ విధానంలో భాగంగా రాష్ట్రాన్ని 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదిస్తూ త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
 
కొత్త జోనల్ విధానంలో 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకే కేటాయించనుండగా, మిగిలిన 5 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. ఈ ఓపెన్ కేటగిరిలోనూ మిగతా తెలంగాణ జిల్లాలకు చెందిన అభ్యర్థుల మాత్రమే పోటీ పడేందుకు వీలుంది. 
 
దీంతో అన్ని ఉద్యోగాలు కేవలం తెలంగాణ స్థానికత ఉన్నవారికే దక్కనున్నాయి. గతంలో జిల్లా స్థాయిలో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ పోస్టులు ఉండేవి. అదే జోన్ల విషయానికి వస్తే ఈ నిష్పత్తి 70:30గా ఉండేది. అంటే 70 శాతం తెలంగాణ యువతకు 30 శాతం ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో ఇచ్చేవారు. 

సంబంధిత వార్తలు

కుప్పంలో చంద్రబాబు పర్యటన.. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాం..

అమెరికా స్కాట్ కీ వంతెనను ఢీకొట్టిన కంటైనర్ షిప్.. భారీగా మృతులు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కవితకు జ్యూడిషియల్ రిమాండ్... తిహార్ జైలుకు తరలింపు!!

ఢిల్లీ నగరంలో మెట్రో రైల్వే స్టేషన్లు మూసివేత.. ఎందుకో తెలుసా?

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరణ

సమ్మర్‌లో వచ్చే తాటి ముంజలు ఎందుకు తినాలో తెలుసా?

ఒక్క జామకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే కలిగే 8 నష్టాలు, ఏంటవి?

హోలీకి ఆరోగ్యకరమైన ట్విస్ట్ జోడించండి: బాదంపప్పును మీ పండుగ స్నాక్‌గా చేసుకోండి

క్షయ వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments