Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కట్టప్పకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. 'బాహుబలి'ని చంపినందుకా?

'బాహుబలి' కట్టప్ప (సత్యరాజ్)కు సమన్లు జారీ అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో ఊటీ కోర్టు కట్టప్పకు ఈ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. కట్టప్ప నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ చేయడం వెనుక కారణాల

కట్టప్పకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. 'బాహుబలి'ని చంపినందుకా?
, మంగళవారం, 23 మే 2017 (15:56 IST)
'బాహుబలి' కట్టప్ప (సత్యరాజ్)కు సమన్లు జారీ అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో ఊటీ కోర్టు కట్టప్పకు ఈ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. కట్టప్ప నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ చేయడం వెనుక  కారణాలను పరిశీలిస్తే... 
 
ఊటీలోని ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఎం.రోజరియో స్థానిక కోర్టులో పరువునష్టందావా వేశారు. నటీనటుల ప్రతిష్టకు భంగం కలిగించేలా తమిళ డెయిలీలో వచ్చిన ఓ వార్తను ఖండించేందుకు 2009 అక్టోబర్ 7న దక్షిణ భారత సినీ నటుల సంఘం (నడిగర సంఘం) చెన్నైలో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే వార్త ప్రచురించిన తమిళ డెయిలీని టార్గెట్ చేయకుండా జర్నలిస్టులందరిపైనా సమావేశంలో బురదచల్లుతూ మాట్లాడారని రోజరియో తన పిటీషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... నటుడు సత్యరాజ్‌తో పాటు సూర్య, శరత్‌కుమార్, సుప్రియ, విజయ్‌కుమార్, అరుణ్ విజయ్, వివేక్, చరణ్‌లు కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. ఈ నోటీసులు పట్టించుకోని నటీనటులంతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయంపు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనను తోసిపుచ్చి ఈనెల 16వ తేదీ కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశించింది. అయిప్పటికీ వారు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఈ ఎనిమిది మంది నటులకు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెంథిల్ కుమార్ రాజవెల్ నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మహాభారతం'లో కర్ణుడి పాత్ర చేయమని అడిగారు : నాగార్జున ఇంటర్వ్యూ