Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జై కుమారే అసలు దొంగన్న వర్మ- ట్రాఫిక్ వల్లే జీఎస్టీ లింకు ఓపెన్ కాలేదు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ కథ తనదేనని.. తన వద్ద నుంచి దొంగలించి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా తీశారని జై కుమార్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ వ్యవహారంపై నోరు మెదపకుండా వున్న వర్మ తా

జై కుమారే అసలు దొంగన్న వర్మ- ట్రాఫిక్ వల్లే జీఎస్టీ లింకు ఓపెన్ కాలేదు
, శుక్రవారం, 26 జనవరి 2018 (12:54 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ కథ తనదేనని.. తన వద్ద నుంచి దొంగలించి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా తీశారని జై కుమార్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ వ్యవహారంపై నోరు మెదపకుండా వున్న వర్మ తాజాగా స్పందించారు. జీఎస్టీ ఆన్‌లైన్‌లో విడుదలైన తరుణంలో జైకుమార్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తేల్చేశారు. జై కుమార్ తన కార్యాలయంలో పనిచేసిన మాట మాత్రం వాస్తవం. 
 
కానీ అతనో దొంగని, తన ఆఫీసులో అనేకసార్లు దొంగతనం చేస్తూ జై కుమార్ పట్టుబడ్డాడని వర్మ తెలిపారు. దొంగతనం చేస్తూ పట్టుబడినా వదిలేశానని.. చివరకు పది నెలల క్రితమే తన బృందం నుంచి తొలగించానని వర్మ స్పష్టం చేశాడు. జై కుమార్‌కు అనవసరంగా పబ్లిసిటీ ఇవ్వరాదన్న ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లు మౌనంగా ఉండిపోయానని తెలిపాడు. ఇకపై సైలెంట్‌గా వుండబోనని అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వర్మ చెప్పుకొచ్చాడు. 
 
ఇదిలా ఉంటే.. వర్మ జీఎస్టీ సినిమాను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు విడుదలైంది. జీఎస్టీని వీక్షించాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. జీఎస్టీ లింక్ ఎంతకీ ఓపెన్ కాలేదు. దీనిపై వర్మ వివరణ ఇచ్చారు.
 
ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున వీడియో లోడ్ కావడానికి అధిక సమయం పడుతున్నందున, అప్ గ్రేడ్ చేసే నిమిత్తం ఆపినట్టు వర్మ చెప్పుకొచ్చారు. అభిమానుల ఆత్రుతకు తగ్గట్టుగా అధికమంది ఒకేసారి వీక్షించేందుకు 'స్ట్రయిక్ ఫోర్స్' ఏర్పాట్లు చేస్తున్నట్లు వర్మ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్మ జీఎస్టీ విడుదల: ట్రెండ్ మారిపోయింది.. 10 గంటల్లో 2లక్షల మంది వెతికారు!