Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊరు పేరు భైరవకోన కోసం మంత్రదండం పట్టుకున్న సందీప్ కిషన్

Sandeep Kishan
, గురువారం, 21 డిశెంబరు 2023 (16:55 IST)
Sandeep Kishan
హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవ సారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ 2024లో విడుదల కానున్న క్రేజీ, మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.
 
ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు మేకర్స్. ఊరు పేరు భైరవకోన ఫిబ్రవరి 9, 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో  సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన యాక్షన్ సీక్వెన్స్‌ చాల క్యూరియాసిటీని పెంచింది.  రెండు నెలల్లో సినిమా రాబోతుంది కాబట్టి మేకర్స్ త్వరలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు.
 
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.
 
ఊరు పేరు భైరవకోనలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వుండబోతుంది. టీజర్ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
 
వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ సెన్సార్ పూర్తి