Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్జున్ రెడ్డి కి సిద్ధార్థ్ రాయ్ పోలికే కాదు :హీరో దీపక్ సరోజ్

Deepak Saroj

డీవీ

, బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (19:31 IST)
Deepak Saroj
టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో దీపక్ సరోజ్ పలు విషయాలు తెలిపారు.
 
-చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాను. 2016 వరకూ యాక్టివ్ గా చేస్తూనే వున్నాను. మిణుగురులు చిత్రంలో చేసిన పాత్రకు నంది అవార్డ్  కూడా వచ్చింది. అప్పుడే సినిమాలపై  మరింత ప్యాషన్ పెరిగింది. తర్వాత ఓ ఐదేళ్ళు చదువుకున్నాను. ఎంబీఏ పూర్తయిన తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లోకి వచ్చాను. ఈ  సమయంలో దర్శకుడు యశస్వీ గారు సంప్రదించారు. కథ విన్నాక షాక్ అయ్యాను. అసలు అలాంటి పాత్ర చేయగలనా? అనుకున్నాను. యశస్వీ గారు నన్ను బలంగా నమ్మారు. అలా ‘సిద్ధార్థ్ రాయ్’ మొదలైయింది.
 
- సిద్ధార్థ్ రాయ్ పాత్ర చాలా లాజికల్ గా ఎక్స్ట్రీమిజంలో వుంటుంది. తను చాలా నాన్ రియాక్టివ్ గా ఉంటాడు. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. దాదాపు రెండు నెలలు పాటు చాలా విషయంలో నాన్ రియాక్టివ్ గా వుండటాని ప్రయత్నించాను. కొంత ఫిలాసఫీ కూడా చదివాను. రెండు నెలలు పాటు ఒక ఎమోషనల్ స్టెబిలిటీ అయితే వచ్చింది. కానీ మళ్ళీ పోయింది. ఎందుకంటే అదే ‘సిద్ధార్థ్ రాయ్’ మళ్ళీ ఎమోషనల్ అయిపోతాడు. మొదట్లో ఎంత కంట్రోల్ గా ఉంటాడో తర్వాత అంత అన్ కంట్రోల్ అయిపోతాడు. అలా జ్ఞానోదయం వచ్చినట్లే వచ్చి మళ్ళీ పోయింది ఇది ప్లెయిన్ క్యారెక్టర్ కాదు. దిని కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. అనుకున్నట్లు వస్తుందా రాదా అనే విషయంలో ఒత్తిడి కూడా వుండేది.
 
-‘సిద్ధార్థ్ రాయ్’ లుక్ అలా అనిపించవచ్చు ఏమో కానీ ‘సిద్ధార్థ్ రాయ్’, అర్జున్ రెడ్డి కథలకు ఏ విషయంలోనూ పోలిక లేదు. రెండు భిన్నమైన కథలు. ట్రీట్ మెంట్ లో కూడా లింక్ వుండదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు కూడా పదో నిమిషం నుంచి మెల్లగా ‘సిద్ధార్థ్ రాయ్’ వరల్డ్ లోకి వచ్చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమా చిత్రం మహా శివరాత్రికి సిద్ధమవుతోంది