Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొన్నిసార్లు నిరాశగా కొన్నిసార్లు మోటివేటెడ్‌గా అనిపించేది : ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda with directors
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:18 IST)
Anand Devarakonda with directors
"బేబీ" సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "గం..గం..గణేశా".  హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న"గం..గం..గణేశా" సినిమా టీజర్ ను ఇవాళ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, విరూపాక్ష కార్తీక్ దండు, మిడిల్ క్లాస్ మెలొడీస్ డైరెక్టర్ వినోద్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - బేబి సినిమా రిలీజై రెండు నెలలు అవుతోంది. ఈ రెండు నెలల్లో బేబి సినిమాకు మీరిచ్చిన లవ్ మర్చిపోలేను. మీరు ఆ సినిమాను ఎంతో దూరం తీసుకెళ్లారు. బేబిలో ఎంత ఎమోషనల్ అయ్యారో "గం..గం..గణేశా" లో అంత ఎంటర్ టైన్ అవుతారు. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూర్స్ తో పనిచేస్తున్నా. నేను ఈ టీమ్ లో కొంత ఎక్స్ పీరియన్స్ ఉన్న వాడిని. ఫన్, క్రైమ్, యాక్షన్ వంటి అంశాలతో మిమ్మల్ని ఆకట్టుకునే మూవీ ఇది. ఈ సినిమా సూపర్బ్ గా ఉంటుంది. కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాం. రేపు థియేటర్ లో మీరు  కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు.

బేబి, ఈ సినిమా రెండు ప్యారలల్ గా చేశాను. కొన్నిసార్లు నిరాశగా అనిపించేది. కొన్నిసార్లు మోటివేటెడ్ గా అనిపించేది. అన్ని సందర్భాల్లో డైరెక్టర్ ఉదయ్ స్ట్రాంగ్ గా ఉండేవాడు. హీరోగా ఇది నాకు ఆరో సినిమా. ఇందులో నలుగురు కొత్త దర్శకులు నాతో ఇండస్ట్రీకి వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. మెలొడీ, ర్యాప్ సాంగ్స్..ఇలా సాంగ్స్, బీజీఎం అదిరిపోతాయి. కో ప్రొడ్యూసర్ అనురాగ్ గారు మూవీకి ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. వంశీ, కేదార్ బిగ్ ప్రొడ్యూసర్స్ అవుతారు. భయం, అత్యాశ, కుట్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుంటుంది. సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరి ప్లాన్స్ తో వారు ఉంటారు. రేసీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చూస్తారు. నా గత చిత్రాలతో చూస్తే చాలా డిఫరెంట్ మూవీ ఇది. నేను కథను నమ్మే సినిమా సెలెక్ట్ చేసుకుంటా. కొత్త వాళ్లైనా, ఎక్సీపిరియన్స్డ్ డైరెక్టర్స్ అయినా హిట్స్, ఫ్లాప్స్ ఇస్తారు. కానీ ప్రతి దర్శకుడికి ఓ విజన్ ఉంటుంది. నేను దాన్ని నమ్మి సినిమా చేస్తాను. "గం..గం..గణేశా" బేబి సినిమా కలెక్షన్స్ దాటేస్తుందని..అలాంటి లెక్కలు వేసుకోలేదు. ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంటుంది. అన్నయ్య విజయ్ తో ఫ్యూచర్ లో కలిసి సినిమా చేస్తానేమో చూాడాలి. ఇప్పటికైతే అలాంటి ప్రాజెక్ట్ అనుకోలేదు. అన్నారు.
 
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ - మా డైరెక్టర్ ఉదయ్ ఎంత ప్యాషనేట్ గా మూవీ రూపొందించాడో మీకు టీజర్ లోనే కనిపిస్తుంది. ఈ కథకు నేను మ్యూజిక్ తో న్యాయం చేయగలను అని నమ్మినందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థాంక్స్. మంచి మ్యూజిక్ ఇచ్చాననే అనుకుంటున్నాను. సినిమా కోసం ఆనంద్ దగ్గర నుంచి అందరం ఒక టీమ్ లా ప్యాషనేట్ గా కష్టపడ్డాం. అందుకు మా ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇవాళ థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పించాలంటే ఛాలెంజింగ్ కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్ మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాాం అన్నారు.
 
కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - మేమంతా ఒక మంచి సినిమా చేశామని చెప్పగలను. దర్శకుడు ఉదయ్ మాకు కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్ లో స్టోరీ ఓకే అయ్యింది. మా అందరికీ అంత బాగా కథ నచ్చింది. ఆ కథను అంతకంటే అందంగా తెరకెక్కించారు. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
ప్రొడ్యూసర్ వంశీ కారుమంచి మాట్లాడుతూ - మీరంతా టీజర్ చూశారు. టీజర్ ఎంత ఎనర్జిటిక్ గా, కామెడీగా ఉందో మూవీ కూడా అంతే యాక్షన్ కామెడీతో ఉంటుంది. ఇది ప్రొడ్యూసర్స్ గా మాకు, డైరెక్టర్ ఉదయ్ కు ఫస్ట్ మూవీ. మేము ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన ఆనంద్ కు థాంక్స్. ఆనంద్ ఇప్పటిదాకా డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా కొత్తగా ప్రయత్నించాడు. "గం..గం..గణేశా" సినిమా మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ సినిమా ఈ  ఇయర్ ఆనంద్ కు సెకండ్ సూపర్ హిట్ అవుతుంది. నిజానికి ఈ వినాయక చవితికే సినిమాను రిలీజ్  చేద్దామని అనుకున్నాం. ఈ ఇయర్ ఎండ్ కు "గం..గం..గణేశా" తెరపైకి తీసుకొస్తాం.  అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో పెళ్లి ట్రోల్స్.. ఎవడు పట్టించుకుంటాడు.. వాటిని..?