Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం

దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం దక్కనుంది. తెలుగు ప్రేక్షకులనే కాకుండా భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రీదేవి... దుబాయ్‌లో బంధువుల వివాహానికి హాజరై బాత్ టబ్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి త

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (16:34 IST)
దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం దక్కనుంది. తెలుగు ప్రేక్షకులనే కాకుండా భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రీదేవి... దుబాయ్‌లో బంధువుల వివాహానికి హాజరై బాత్ టబ్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఎవర్‌ గ్రీన్ హీరోయిన్ జాబితాలో ముందుండే శ్రీదేవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు. తాజాగా శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కనుంది. 
 
తమ దేశంలో శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశంలో తెరకెక్కిన పలు చిత్రాల్లో శ్రీదేవి నటించారని స్విట్జర్లాండ్ అధికారులు ప్రకటించారు. శ్రీదేవి నటించిన పలు సినిమా షూటింగ్‌లు తమ దేశంలో జరిగాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.  ఆమె దివికేగిన నేపథ్యంలో ఆమె గౌరవార్థం శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్విజ్ సర్కారు తెలిపింది. శ్రీదేవి స్విట్జర్లాండ్ పర్యాటకం అభివృద్ధి చెందేందుకు కారకులయ్యారని తెలిపింది. 
 
శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని స్విజ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. చాలా సినిమాలను స్విట్జర్లాండ్ కేంద్రంగా తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు యశ్ చోప్రా విగ్రహాన్ని స్విస్ ప్రభుత్వం 2016లో అక్కడ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments