Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరాపై నిషేధం విధిస్తారా? సాహోకు కూడా ఆ దెబ్బ తప్పదా?

మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు వేయికనులతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేవు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (15:12 IST)
మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు వేయికనులతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేవు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


అయితే ఇది తెలుగునాట మాత్రం కాదు.. కన్నడలో అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. 
 
ఇందుకోసం వివిధ భాషలకి చెందిన నటీనటులను ఈ చిత్రంలో ఎంపిక చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ సినీ రంగం తీసుకోబోయే ఓ నిర్ణయం 'సైరా' సినిమాకు శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కన్నడ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్‌ని కన్నడలో విడుదల చేయడం నిషేధించాలని సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందట.
 
ఈ భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమాల కారణంగా కన్నడలో చిన్న సినిమాల పరిస్థితి దెబ్బ తింటుందని.. దాని కారణంగా డబ్బింగ్ సినిమాలపై నిషేధం విధించాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది నుండి ఈ నిషేధం అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే గనుక జరిగితే ముందుగా ఆ ఎఫెక్ట్‌ పడేది సైరా సినిమా మీదేనని సినీ పండితులు చెప్తున్నారు. ఇదే ప్రభావం సాహోపై కూడా వుంటుందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌ను ఓడించడం అసాధ్యం.. మంత్రి అంబటి రాంబాబు

ఒక రాయికి మూడు గాయాలు ఎలా తగులుతాయి? టీడీపీ అధికార ఆనం వెంకటరమణారెడ్డి

వివేకా హత్యపై మా వద్ద ఆధారులున్నాయ్.. అత్తమ్మపై సునీత ఫైర్

అబ్బబ్బా... జగన్‌కు గులకరాయి తగిలితేనే రాష్ట్రానికి గాయమైనట్లా? : పవన్ కళ్యాణ్

లోక్‌సభ ఎన్నికలు : రోజుకు రూ.100 కోట్ల నగదు స్వాధీనం

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిరోధించే మార్గాలు ఇవే

ఖాళీ కడుపుతో కలబంద రసం ఉదయం పూట సేవిస్తే?

దేహానికి సంపూర్ణ శక్తి అందాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే

చామంతి టీ తాగితే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో చేర్చుకుంటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments