Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు సినిమా క్రమశిక్షణ నేర్పింది : రియల్ హీరో సోనూ సూద్

Sonu Sood,Turum Khan team
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (16:54 IST)
Sonu Sood,Turum Khan team
స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తురుమ్ ఖాన్ లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 31 న SVIT కాలేజ్ సికింద్రాబాద్ లో ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ కు రీల్ అండ్ రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా వచ్చి మరింత సందడి నెలకొల్పారు. వెండితెర హీరో సోనూ సూద్ చీఫ్ గెస్ట్ గా, అంబర్పేట్ శంకర్, చీకోటి ప్రవీణ్, చిన్న శ్రీశైలమ్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రం అన్ని పనులను ముగించుకొని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 8వ తేదీన విడుదలకు రంగం సిద్ధం అయ్యింది.
 
ఈ సందర్భంగా రియల్ హీరో సోనూ సూద్ మాట్లాడుతూ మొదటగా తురుమ్ ఖాన్ లు ఖచ్చితంగా 500 కోట్లు వసూళ్ చేసే సినిమాగా ఎదుగుతుందని తెలిపారు. సినిమాను నిర్మించడం ఎంత పెద్ద కష్టమో ఆయనకు తెలుసని ఈ విషయంలో నిర్మాత ఎండి ఆసిఫ్ జానీని మెచ్చుకున్నారు. తను సినిమా ప్రయత్నాలు చేస్తున్న రోజులను గుర్తు చేస్తూ.. మనం సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం ఉంటుందని, అందుకని ప్రేక్షకులు అందరూ తురుమ్ ఖాన్ లు చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరారు. సినిమాలో చాలా మంచి సబ్జెక్టు ఉందని వచ్చే సంవత్సరానికి తురుమ్ ఖాన్ లు పార్ట్ 2, పార్ట్ 3 తీయాలన్నారు. తాను పంజాబ్ కు చెందినవాడైన తెలంగాణ ఆంధ్ర ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెవరూ చూపించారని అన్నారు. తాను హిందీ సినిమాలను వదిలేసి తెలుగు సినిమాలను చేస్తున్నప్పుడు చాలామంది తనను ఎందుకు అని అడిగారని అప్పుడు తెలుగు సినిమా తనని నటుడిని చేసిందని, తెలుగు సినిమా తనకు క్రమశిక్షణ నేర్పిందని అందుకే తెలుగు వారన్నా, తెలుగు సినిమా అన్న తనకు ఇష్టం అని చెప్పారు. సాధ్యమైనంత వరకు తాను ఎంటర్ టైన్ చేస్తానని అన్నారు.
 
"తురుమ్ ఖాన్ లు" హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. తను పదవ తరగతిలో ఉన్నప్పుడు అరుంధతి సినిమా చూసి 103 జ్వరంతో హాస్పటల్ బెడ్ పై ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. అలా సోనూ సూద్ ను చూసి భయపడిన తాను ఈరోజు ఆయన పక్కనే నిలబడి మాట్లాడడం తనకెంతో ఆనందమని, తాను హీరోగా పని చేసిన "తురుమ్ ఖాన్ లు" చిత్రానికి ముఖ్యఅతిథిగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోనూ సూద్ గురించి ఏం చెప్పినా తక్కువే అని, ఆయన "రియల్ తురుంఖాన్ ఆఫ్ ఇండియా" గా అభివర్ణించారు. ఇక తన లైఫ్ లో వాళ్ల నాన్న, తన ఫ్రెండ్ బబ్లూ, ఈ సినిమా డైరెక్టర్ శివ కళ్యాణ్ ఈ ముగ్గురు ఎంతో ప్రాధాన్యత వహించారని పేర్కొన్నారు. సినిమాలో స్టార్ క్యారెక్టర్ లేకపోయినా, అందరూ కొత్తవాళ్ళైనా సరే రెండున్నర గంటలసేపు ప్రేక్షకులను కచ్చితంగా నవ్విస్తుందని, అలానే డైరెక్టర్ శివ కళ్యాణ్ తెరకెక్కించారని నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాత ఆసిఫ్ జానీ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో ఇష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కడే తన భుజాలపైన సినిమాను మోసాడని కొనియాడారు. అలాగే తనతో పాటు యాక్టింగ్ చేసిన కో యాక్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
 
తుపాకులగూడెం అనే ఒక విలేజ్లో విష్ణు ఈశ్వర బ్రహ్మ అనే ముగ్గురు క్యారెక్టర్ల చుట్టూ ఈ కథ నడుస్తుందని డైరెక్టర్ శివ కళ్యాణ్ వెల్లడించారు. పురాణాల్లో ఉండే బలమైన క్యారెక్టర్లను సినిమాలో అత్యద్భుతంగా ఆవిష్కృతం చేశామని పేర్కొన్నారు. ఇక సినిమా నిర్మాత ఎండి ఆసిఫ్ జానీ ఎంతో కృషి చేశారని, ఆయన లేకుంటే ఈరోజు ఇలా వేడుక చేసుకునే వారం కాదని అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుందని, సెప్టెంబర్ 8న అందరు తప్పకుండా థియేటర్లో సినిమాను చూడాలని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూపూర్ సనన్ ను ఏక్ దమ్ ఏక్ దమ్ అంటూ ఆటపట్టిస్తున్న టైగర్ నాగేశ్వరరావు