Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీకల వరకు తాగిన బుల్లితెర నటుడు.. బ్రీత్‌ ఎనలైజర్ టెస్టులో చిక్కిపోయాడు!

హైదరాబాద్ నగర పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అనేక మంది సినీ, బుల్లితెర నటులు చిక్కిపోతున్నారు.

పీకల వరకు తాగిన బుల్లితెర నటుడు.. బ్రీత్‌ ఎనలైజర్ టెస్టులో చిక్కిపోయాడు!
, ఆదివారం, 26 జూన్ 2016 (09:42 IST)
హైదరాబాద్ నగర పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అనేక మంది సినీ, బుల్లితెర నటులు చిక్కిపోతున్నారు. అయినప్పటికీ మిగిలిన నటుల్లో ఏమాత్రం మార్పురావడం లేదు. తాజాగా ఓ బుల్లితెర నటుడు పోలీసులకు దొరికాడు.
 
పీకల వరకు మద్యం సేవించి తాగి కారు నడుపుతూ దొరికిపోయాడు. దీంతో అతనిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వీకెండ్‌ సందర్భంగా  రాత్రి పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 
 
వాహనాలు తనిఖీల్లో భాగంగా బుల్లితెర సీరియల్స్‌లో నటించే భరణి కారును ఆపి బ్రీతింగ్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించగా 42 శాతం మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా రంగంపై ప్యాష‌న్ ఉన్న వారంద‌రికీ తిక్క ఉంటుంది... రాజేంద్ర‌ప్ర‌సాద్