Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆది పినిశెట్టి శబ్దం చిత్రం కోసం 120 ఏళ్ల నాటి లైబ్రరీని నిర్మించారు

Arivalagan, Aadi Pinishetti

డీవీ

, శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (19:02 IST)
Arivalagan, Aadi Pinishetti
హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ 'వైశాలి'తో సెన్సేషనల్ హిట్ అందించిన తర్వాత, మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌ 'శబ్దం' చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాత. ముంబై, మున్నార్,  చెన్నైలోని అనేక ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరించారు. సినిమా కోసం 120 ఏళ్ల నాటి లైబ్రరీని నిర్మించారు.
 
గతంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ ఈరోజు టీజర్‌ను రివిల్ చేశారు. విక్టరీ వెంకటేష్ టీజర్ లాంచ్ చేశారు. టీజర్‌తో సినిమాలోని అదిరిపోయే సెటప్‌ని పరిచయం చేయడంతో పాటు ఉత్కంఠమైన అనుభూతిని అందించింది.  
 
హీరో ఆది పినిశెట్టి ఒక హాంటెడ్ హౌస్ వద్ద కొన్ని వింత సంఘటనలు జరిగేటప్పుడు కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేయడం కనిపిస్తుంది.  టీజర్‌లో సినిమాలోని ప్రముఖ నటీనటులందరినీ చూపించారు. టీజర్ ఖచ్చితంగా అంచనాలను అందుకుంది.
 
ఆది పినిశెట్టి తన పాత్రలో అద్భుతంగా నటించారు. దర్శకుడు అరివళగన్ ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో టీజర్ ని టెర్రిఫిక్ గా ప్రజెంట్ చేసారు  
 
అరుణ్ బత్మనాభన్ కెమెరా యాంగిల్స్ ప్రతి బ్లాక్‌లోఉత్కంఠతని క్రియేట్ చేసింది,  సంగీత దర్శకుడు థమన్ ఎస్ తన అసాధారణమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఫియర్ ఫ్యాక్టర్ ని పెంచారు.  
 
వైశాలిలో చాలా రైన్ బేస్డ్ సన్నివేశాలు ఉండగా, శబ్దం సినిమాలో చాలా సన్నివేశాలు పర్వతాలు, పర్యాటక ప్రదేశాలలో చిత్రీకరించబడ్డాయి అలాగే ఈ సినిమాలో సౌండ్‌కి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉండబోతున్నాయి.
 
సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటింగ్ చేస్తున్నారు. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
తారాగణం: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి డైరెక్షన్‌లో స్టార్ క్రికెటర్ డేవిడ్ భాయ్!