Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనేనా చిత్రంతో రెజీనా కసాండ్రా భయపెడుతుందా!

Regina Cassandra
, శుక్రవారం, 4 ఆగస్టు 2023 (16:22 IST)
Regina Cassandra
2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా . తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ముఖ్యంగా రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి పేరును సాధించుకుంది. 
 
రెజీనా ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో "సూర్పనగై" అనే సినిమాను చేస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది.
 
కాగా, అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. నేనేనా సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికేట్ ను సెన్సార్ సభ్యులు ఇచ్చారు. సినిమా విభిన్నంగా ఉందని, మంచి కంటెంట్‌తో వస్తుంది అంటూ మూవీ యూనిట్‌ని సెన్సార్ సభ్యులు అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలుగాడి లవ్ స్టోరి నుంచి బేగంపేట కుర్రాదాన్ని మామా సాంగ్ క్రేజ్