Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరి 17న రవితేజ-గుణశేఖర్‌-వై.వి.యస్‌.చౌదరిల 'నిప్పు'

ఫిబ్రవరి 17న రవితేజ-గుణశేఖర్‌-వై.వి.యస్‌.చౌదరిల 'నిప్పు'
, మంగళవారం, 24 జనవరి 2012 (16:58 IST)
WD
రవితేజ, దీక్షాసేథ్‌ హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ వై.వి.యస్‌.చౌదరి నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'నిప్పు' షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత వై.వి.యస్‌.చౌదరి మాట్లాడుతూ - ''ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించిన పాటతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది.

థమన్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అన్ని ఏరియాల్లో ఆడియో సేల్స్‌ బాగుందని రిపోర్ట్స్‌ వస్తున్నాయి. మా బొమ్మరిల్లు బేనర్‌లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. దానికి మించిన రేంజ్‌లో 'నిప్పు' ఆడియోకి రెస్పాన్స్‌ వస్తోంది. రవితేజ, గుణశేఖర్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

రవితేజ సరసన దీక్షాసేథ్‌ కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో డా|| రాజేంద్రప్రసాద్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మానందం, కృష్ణుడు, óర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌ దేవ్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, శ్రీధర్‌ సీపన, సంగీతం: థమన్‌, సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, గణేష్‌ తరుపాయ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌.కిషోర్‌, కో-ప్రొడ్యూసర్స్‌: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వై.వి.యస్‌.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్‌.

Share this Story:

Follow Webdunia telugu