Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువత ఆలోచనలకు అద్దమే బిఫోర్ మ్యారేజ్ - రివ్యూ

Before Marriage

డీవీ

, శుక్రవారం, 26 జనవరి 2024 (22:42 IST)
Before Marriage
న‌టీన‌టులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ‌ తదితరులు 
సాంకేతికత:  కెమెరా : రాజశేఖర్ రెడ్డి, మ్యూజిక్: పీఆర్, నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి,  ద‌ర్శ‌క‌త్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ర‌వికుమార్ గొల్ల‌ప‌ల్లి, ఎడిటింగ్ అలోష్యాస్ క్స‌వెర్, పీఆర్: ఆశోక్ ద‌య్యాల‌, విడుద‌ల‌: జ‌న‌వ‌రి 26
 
ఇప్పటి చిన్న సినిమాలన్నీ యువతను బేస్ చేసుకునే తీస్తుంటారు. దానికి కొన్ని హంగులు దిద్ది వాటిని సమాజ పోకడలు చూపిస్తూ ఆవిష్కరించే ప్రయత్నమే బిఫోర్ మ్యారేజ్ సినిమా. టైటిల్ ను బట్టే ఏ తరహా సినిమానే ఇట్టే తెలిసిపోతుంది. మూడు ద‌శాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా ప‌రిచ‌య‌మ‌వుతూ హనుమ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన‌ మూవీ 'బిఫోర్ మ్యారేజ్'. శుక్ర‌వారం థియేట‌ర్‌ల‌లో విడుద‌లైంది. మరి ఎలా ఉందో చూద్దాం.
 
క‌థ‌:
కాలేజీ చదివే  ధ‌ర‌ణి (నవీన రెడ్డి), తన స్నేహితులైన శాంతి, ప్రశాంతితో కలిసి ఒకే రూమ్ లో వుంటుంది. ఇప్పటి ట్రెండ్ కు తగినట్లు ఆలోచనలతో టేక్ ఇట్ ఈజీగా తీసుకునే తత్త్వం. దాంతో ఎంజాయ్ మెంట్ కోరుకునే క్రమంలో ధరణి పెగ్నెన్సీ అవుతుంది. ఇక ఈ విషయం తెలిసిన సమాజం ఊరుకుంటుందా? ఆ పరిస్థితులతో మానసిక క్షోభకు గురవుతుంది. ఒక్క సారిగాతన జీవితం కుంగిపోయినట్లు ఫీలవుతుంది. ఈ ప‌రిస్థితుల్లో ఆమె తండ్రి ఆమెను అంగీకరిస్తారా?  ఇటువంటి స్తితి నుంచి ఆమె ఏం చేసింది? అనేది ఈ సినిమా క‌థ‌.
 
విశ్లేష‌ణ‌: 
ఈ చిత్రం కాస్పెప్ట్ కొత్తదేమీకాదు. ట్రీట్ మెంట్ కొత్తగా అనిపిస్తుంది. రెండు దశాబ్దాల క్రితం దర్శకుడు తేజ తీసిన చిత్రం కాన్సెప్ట్ కూడా ఇంచుమించు ఇలాంటిదే. నేపథ్యం కొత్తది. అప్పటికీ ఇప్పటికీ యువతుల ఆలోచనలు బాగా మారిపోయాయి.  వాటిని బేస్ చేసుకుని దర్శకుడు అల్లిన కథలా అనిపిస్తుంది. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లే ఈ సినిమాలో స‌న్నివేశాలుగా క‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల తాను రాసుకున్న క‌థ‌కు త‌గిన‌ట్టే తెర‌మీద చూపించ‌డంలో సఫలీక్రుతుడయ్యాడనే చెప్పాలి.
 
యదార్ధ సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు చిత్ర‌యూనిట్ ముందే ప్ర‌క‌టించింది. పెళ్లికి ముందు త‌ప్పు అనిపించ‌ని ఓ పొర‌పాటు.. లైఫ్‌ను పూర్తిగా మార్చేస్తుంద‌ని చూపించిన విధానంలో ఇచ్చిన మెసెజ్ యువ‌త‌కు సూటిగా తాకుతుంది. తాత్కాలిక ఆనందాల కోసం పెడదోవ పడుతున్న యువతకు ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించారు. 
 
న‌టీన‌టుల పరంగా చూస్తే, ప్ర‌ధాన పాత్ర‌ పోషించిన న‌వీన‌రెడ్డి క్యూట్‌గా కనిపించింది. ఈ త‌రం అమ్మాయిల ఆలోచ‌న దోర‌ణి ఎలా ఉంటుందో స‌రిగ్గా అలాగే చేసి చూపించింది. హీరో భార‌త్ ఆకాష్ పాత్రలో యూత్‌ను ఎట్రాక్ట్ చేశాడు. చక్క‌గా, చ‌లాకీగా క‌నిపించాడు. ఇక అపూర్వ త‌న పాత్ర త‌గ్గ‌ట్టుగా న‌టించి మెప్పించింది. ఇత‌ర పాత్రలు త‌మ ప‌రిది మేర‌కు న‌టించి మెప్పించారు. 
 
టెక్నికల్ గా చూసుకుంటే, మ్యూజిక్ డైరెక్ట‌ర్ పీఆర్ చేసిన పాట‌లు బాగున్నాయి. సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. 'ఇదేమి జిందగీ.  రొటీన్ గా ఉన్నది.." పాట బాగుంది. సహజంగా కెమెరా పనితనం రాజశేఖర్ రెడ్డి చూపించారు. అలోష్యాస్ క్స‌వెర్ ఎడిటింగ్ స‌రిగ్గా కుదిరింద‌ని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.  అక్కడక్కడాచిన్నపాటిలోపాలున్నా, ఇప్పటి తరం చూడాల్సిన సినిమా. 
రేటింగ్: 2.75 / 5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవిష్యత్‌లో చిరంజీవికి "భారతరత్న" కూడా రావాలని కోరుకుంటున్నా : మంత్రి కోమటిరెడ్డి