Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేక్షకులకు సరి కొత్త అనుభూతినిచ్చే గేమ్ ఆన్ రివ్యూ

Geetanand,Neha Solanki

డీవీ

, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (07:47 IST)
Geetanand,Neha Solanki
నటీనటులు : : గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌, ఆదిత్య మీనన్, వాసంతి, కిరిటీ తదితరులు.  
సాంకేతికత:కెమెరా : అర‌వింద్ విశ్వనాథ‌న్‌, ఎడిటర్ : వంశీ అట్లూరి, సంగీతం :  అభిషేక్ ఏ.ఆర్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్, ఆర్ట్ డైరెక్టర్:  విఠ‌ల్‌ ;  స్క్రిప్ట్  సూప‌ర్ వైజ‌ర్ : విజ‌య్ కుమార్ సి.హెచ్ ;యాక్షన్ కొరియోగ్రఫీః రామ‌కృష్ణ   పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ; 
నిర్మాత : రవి కస్తూరి ; కథ–మాటలు–స్ర్కీన్‌ప్లే–- ద‌ర్శకత్వం :  దయానంద్.
విడుదల తేదీ ; 02–02–2024
 
కథ :
గీతానంద్ తల్లి ప్రేమకు దూరమవుతాడు. తను వేరే వివాహం చేసుకుని వెళ్లడంతో ఆ ప్రేమ కూడా దూరమైందని తల్లిపై ద్వేషం పెంచుకుంటాడు కొడుకు.  ఆ ద్వేషం సైకో గా మారుతుంది. దాంతో తన అమ్మ గురించి చెడుగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై గొడవపడి ఓ దశలో ఒకరిని క్రూరంగా చంపేస్తాడు. ఆ మర్డర్ ను తాత పై వేసుకుని మనవడిని తప్పిస్తాడు. 
ఇది తెలిసిన తల్లి ఓ సైక్రియాటిస్ట్ (ఆదిత్యమీనన్)కు చూపించేలా చేస్తుంది. కానీ అతను గీతానంద్ ను తన స్వార్థం కోసం వాడుకుంటాడు. ఒకానొక సందర్భంలో చనిపోదాం అనుకునే హీరోను ఓ గేమ్ మార్చేస్తుంది. అసలు ఆ గేమ్ ఏమిటి? ఇలా ఎందుకు చేశాడు? ఆ తర్వాత ఏమయింది? గీతానంద్ తల్లి తన కొడుకుకోసం ఏమి చేసింది? ఎందుకలా వదిలి వెళ్ళిపోయింది? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
పాత కొత్త కలయికతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రియల్ టైం సైకలాజికల్  థ్రిల్లర్ గా కొనసాగుతూ ఆడియోన్స్ లో క్యూరియాసిటీని పెంచాలా ఉంది. యాక్షన్, రొమాన్స్ తో పాటు సెంటిమెంట్ ను జోడించి ప్రోపర్ కమర్షియల్ చిత్రంగా రూపొందించారు. రొమాన్స్ విషయంలో గీతానంద్, నేహా సోలంకి మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. 
 
దర్శకుడిది మొదటి సినిమా అయినా అనుభవంతో ఉన్న డైరెక్టర్ లా దయానంద్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిర్మాత రవి కస్తూరి కి కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా.. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఓవరాల్ గా.. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 
 
ఇక హీరో గీతానంద్ తన ఆహార్యంతో, నటనతో ఆకట్టుకుంటాడు. యాక్షన్ తోపాటు ఎమోషన్ ను కూడా బాగా పండించాడు.  హీరోయిన్ నేహా సోలంకి గ్లామర్ లుక్ తో యూత్ ను అట్రాక్ట్ చేసేలా కనిపించింది. సిగరెట్, మందు తాగుతూ మాసివ్ గానూ  మెస్మరైజ్ చేసింది. చాలా రోజుల తర్వాత సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ కీలక పాత్ర పోషించారు. సినిమా ఓపెనింగే ఆయన క్యారెక్టర్ ని చూపిస్తూ ప్రారంభమవుతుంది. సీరియస్ ఇంటెన్స్ పాత్రను పోషించారాయన. హీరో తల్లి పాత్రలో మధుబాల సరికొత్త గెటప్ లో కనిపిస్తుంది. డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆమె ఆకట్టుకున్నారు. ఆదిత్య మీనన్ సైకాలజిస్ట్ గా కనిపించారు. ఆయన క్యారెక్టర్ సినిమాకు కీలకం. ఆయన పోషించిన తీరు ఆయన హావభావాలు ఆయన లుక్ ప్రెజెన్స్ సూపర్బ్ గా ఉంటాయి. ఇక కిరీటి, వాసంతి తమ పరిధి మేర నటించారు. 
 
సాంకేతిక పరంగా చూస్తే, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్ అందించిన విజువల్స్ మెప్పిస్తాయి. సినిమా అంతా రేసీగా సాగేలా ఎడిటర్ వంశీ అట్లూరి ఎడిటింగ్ చేశారు. అభిషేక్ ఏ ఆర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. రిచ్ రిచ్ సాంగు చాలా లావిష్ గా ఉంటుంది. నవాబ్ గ్యాంగ్ అశ్విని అరుణ్ అందించిన పాటలు సినిమాకు ప్లస్ అవుతాయి. డైరెక్టర్  దయానంద్ అన్ని విషయాల్లో కేర్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రామకృష్ణ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు చాలా కొత్తగా ఉంటాయి. ఏది ఏమైనా తెలుగులో కొత్త ప్రయోగంగా వచ్చిన ఈ సినిమాలో అక్కడక్కడా చిన్నపాటి లోపాలు లేకపోలేదు. ఏది ఏమైనా సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలని అభినందించాలి. ఇది ఏమేరకు మరింత ఆకట్టుకుంటుందో ప్రేక్షకుల తీర్పను బట్టి ఆదారపడి వుంటుంది.
రేటింగ్ : 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి- ఐటెంసాంగ్ నుంచి తప్పుకున్న ఈషారెబ్బా