Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త రంగుల ప్రపంచం లోకి తీసుకెళ్ళిన పృథ్వీరాజ్ - రివ్యూ

kotha rangula prapancham

డీవీ

, శనివారం, 20 జనవరి 2024 (19:03 IST)
kotha rangula prapancham
నటీనటులు: పృథ్వీరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫి: S.V శివారెడ్డి,  డైరెక్టర్: పృథ్వీరాజ్, నిర్మాత: దాసరి పద్మ రేఖ, కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: సంగీత్ ఆదిత్య, 
 
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరుపొందిన నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. తన కుమార్తె శ్రీలును వెండితెరకు పరిచయం చేస్తూ శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి హడావుడి తర్వాత నేడు శనివారంనాడు ఈ సినిమా థి యేటర్లో విడుదలయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 
కథ:
షూటింగ్ కోసం ఓ ఫామ్ హౌస్‌కు సినిమా డైరెక్టర్ పృథ్వీ తన టీమ్ తో వెళతాడు. కథ ప్రకారం  శ్రీలు, క్రాంతి కృష్ణ హీరో హీరోయిన్లు. ఇక ఫామ్ హౌస్ లో గురువయ్య అనే వ్యక్తి మేనజర్ గా ఉంటాడు. అతను శ్రీలు ను చూసి తన తన కూతుర్ని గుర్తుకు చేసుకుంటాడు. కాగా,  షూటింగ్ చేస్తున్నటైంలో ఆ ఇంట్లో ఏదో ఉందనే అనుమానం టీమ్ కు కలుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ శ్రీలు నటించేటపుడు ఆమె వింతగా ప్రవర్తిస్తుంది. అయినా ఈ షూటింగ్ ప్రాసెస్ లో హీరో క్రాంతి కృష్ణ, శ్రీలు ప్రేమలో పడుతాడు. అది గురువయ్యకు నచ్చదు.
 
ఇదిలా వుండగా, గురువయ్య గంజాయి స్మగ్లర్ తో డీల్ కుదుర్చుకుని అడ్డొచ్చిన పోలీసులను హతమారుస్తుంటాడు. ఇక్కడ పరిస్థితులను గమనించిన డైరెక్టర్ పృథ్వీ అనుమానంతో ఓ గురువు దగ్గరకు వెళ్తే ఆ ఇంట్లో ఓ అమ్మాయి ఆత్మ శ్రీలును ఆవహించినందని చెబుతాడు.  శ్రీలునే ఎందుకు ఆవహిస్తుంది.? అసలు ఆత్మ ఎవరు? గంజాయి స్మగ్లింగ్ ను పట్టించడానికి క్రాంతి కృష్ణ ఏం చేశాడు? ఆ తర్వాత జరిగిన సంఘటనల సమాహారమే మిగిలిన సినిమా.
 
సమీక్ష
సస్పెన్స్ అంశంతో కూడిన ఈ కథ మొదటినుంచి ఆసక్తిగా వుంది. ఎన్నో సార్లు తెలుగు తెరపై వర్కౌట్ అయిన ఫార్మెట్. ఒక ఇంట్లో షూటింగ్ చేయడం అక్కడ ఒక ఆత్మ ఈ యూనిట్ కు ఎలా చుక్కలు చూపిస్తుంది. ఆద్యాంతం కామెడీతో చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీన్లలో ఆలోచింపజేసేలా ఉంటుంది. హీరో మార్నింగ్ షూటింగ్ చేసుకుంటూ, రాత్రిళ్లు దేనికోసమే వెతుకుతూ ఉంటాడు. దాన్ని సెకండ్ ఆఫ్ లో వివరిస్తారు. 
 
ఇక పాటలు కూడా బాగున్నాయి. ఇక తలపులమ్మ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ క్యారెక్టర్ ఎవరు అచ్చం హీరోయిన్ లా ఉంటుంది. వీరిద్దరికి ఏదైనా సంబంధం ఉందా అనే అనుమానం కలుగుతుంది. కానీ అసలు ట్విస్ట్ తెలిసినప్పుడు జస్టిఫై అవుతాయి. ఇక సెకండ్ ఆఫ్ లో వచ్చే హీరో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అలాగే గురువయ్య చెప్పె తలపులమ్మ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇక సెకండ్ ఆఫ్ కూడా అంతే డీసెంట్ గా ఉంది. కాస్త కామెడీ తగ్గింది అని పిస్తుంది. కానీ ఎమోషనల్ గా చాలా బాగుంది. ఇది కచ్చితంగా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూడాల్సిన సినిమా. ఫుల్ ప్యాకెజ్ మూవీ అని చెప్పవచ్చు.
 
హీరోయిని శ్రీలు నటన బాగుంది. చాలా ఈజీగా నటించింది.  సీనియర్ నటిలా సునాయసంగా చేసింది.  ఇక సెకండ్ క్యారెక్టర్ తలపులమ్మ వచ్చినప్పుడు చాలా బాగుంది. ఇటు మోడర్న్ అమ్మాయిలా కూడా చాలా బాగా చేసింది. ఎలాగు రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ మొదటి సినిమాకే చేసి మెప్పించడం అంటే మాములు విషయం కాదు. ఎలాగే తన బ్లడ్ లోనే నటన ఉంది కాబట్టి శ్రీలు నటించడం చాలా ఈజీ. తన కళ్లు, స్మైల్ కూడా చాలా బాగుంది. అలాగే హీరోగా చేసిన క్రాంతి కృష్ణ యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేసుకున్నాడు, అలాగే స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. తరువాత యాక్టర్ పృథ్వీ అద్భుతంగా చేశారు. తలపులమ్మకు తండ్రి క్యారెక్టర్ చేసిన చౌదరి కూడా చాలా బాగా నటించారు. మిగితా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
 
ఇక టెక్నికల్గా చూస్తే ప్రుథ్వీరాజ్ లో కామెడీ స్టార్ కాదు డైరెక్టర్ వున్నాడనిపిస్తుంది. ఆ మధ్య రవితేజ సినిమాలో తాను డైరెక్టర్ కావాలని రావు రమేష్ సోదరుడిగా నటించాడు. కానీ ఇందులో జీవించాడనే చెప్పాలి.  ప్రతీ సీన్ చాలా అద్భుతంగా చేశారు. తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ఔట్ పుట్ ఇవ్వడం అంటే అది ఆయన అనుభం మూలనే కావచ్చు. సినిమాటో గ్రాఫర్ ఎస్ వీ శివారెడ్డి చాలా చక్కగా చేశారు. ఎడిటర్ గా రామకృష్ణ ఎర్రం ఇంకాస్త తన కత్తెరకు పనిచేప్పాలి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇంకాస్తా పరుగులు పెట్టిస్తే బాగుండు. తరువాత మ్యూజిక్ అందించిన సంగీత్ అదిత్య ఆకట్టుకున్నాడు. పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. చిన్నపాటి లోపాలున్నా థ్రిల్ ఎంటర్ టైన్ మెంట్ లో పెద్దగా కనిపించవు. ఇలాంటి సినిమాలు చూసేవారికి బాగా నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సలార్ 2లో అఖిల్ వున్నట్టా? లేనట్టా? క్లారిటీ ఇచ్చిన లిఖిత రెడ్డి