Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి ఎలా ఉందంటే. రివ్యూ

Ravi Teja Nunna, Neha Jurel

డీవీ

, గురువారం, 14 మార్చి 2024 (18:14 IST)
Ravi Teja Nunna, Neha Jurel 
 



నటీ నటులు: రవితేజ నున్న, నేహా జూరెల్, నాగినీడు, ప్రమోదిని, యోగి ఖాత్రి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ఆ దూరి దుర్గ నాగ మోహన్ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్: మురళీకృష్ణ వర్మన్, సంగీత దర్శకుడు: రోషన్ సాలుర్, రచన: సత్య రాజ్ కుంపట్ల, నిర్మాత: ముత్యాల రామదాసు, దర్శకత్వం: సత్య రాజ్ కుంపట్ల
 
ఈమద్య యూత్ ఫుల్ కథలు గ్రామీణ నేపథ్యంలో సాగుతున్నాయి. అలాంటి కథతో వెంకట శివ సాయి ఫిలింస్ పై ముత్యాల రామదాసు నిర్మించిన చిత్రం రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా స్నేహితులైన దర్శకుడు, హీరో కాంబినేషన్ లో వచ్చింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ:
ఓ గ్రామంలో పలుకుబడి, పరపతి వున్న నాయుడుగారి టుంబానికి చెందిన యువకుడు కర్ణ (రవితేజ నున్న) ఆవారాగా తిరిగుతుంటాడు. అదే ఊరిలో రాజు గారి అమ్మాయి అను (నేహా జురెల్) ప్రేమలో పడతాడు. ఇప్పటి యువకుడిలా ఆమె పొందుకోసం తపిస్తుంటాడు. దాంతో ఓ సందర్భంలో సాకుగా తీసుకుని దగ్గరవ్వాలని చూస్తే అందుకు అను తిరస్కరిస్తుంది. దాంతో పెద్ద గొడవే జరుగుతుంది. కట్ చేస్తే తెల్లారి ఆమె శవంగా కనిపిస్తుంది. మర్డర్ చేశాడనే నెపం హీరో మీద పడుతుంది. ఇది తెలిసిన హీరో తండ్రి నాగినీడు తనదైన కోణంలో పరిశోధిస్తాడు. అప్పుడు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? తర్వాత పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
పేరుకు మర్డర్ మిస్టరీ అయినా మొదట్లో ఎక్కడా అది కనిపించకుండా కేవలం ప్రేమ కోణం, యూత్ అల్లరి అంశాలను దర్శకుడు రాసుకున్నాడు. మధ్యమధ్యలో వచ్చే సన్నివేశాలు అలరిస్తాయినే చెప్పాలి. మొదటి భాగమంతా సాగుతూ, సెకండాఫ్ లో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. 
 
ఇక్కడనుంచి కథను  ప్రేక్షకుడిని అలరించేలా చేయగలిగాడు. ఆ క్రమంలో కొన్ని ఊహించని రహస్యాలు, మలుపులు ప్రేక్షకుడిని థ్రిల్ కు గురిచేస్తాయి. ఈ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం కీలకం. దానిని సంగీత దర్శకుడు బాగానే డీల్ చేశాడు. అయితే ఈ క్రమంలో కొన్ని సీన్లు రొటీన్ గా అనిపిస్తాయి. ప్రేమలో కొత్త కోణం పెద్దగా కనిపించదు.  కొత్తవారు కావడంతో బాగానే పరిధిమేరకు నటించారు.
 
కర్ణ కొత్త వాడయినా పర్వాలేదు. హీరోయిన్గా చేసిన నేహా జురెల్ ఆకట్టుకుంది. కొన్నిచోట్ల నటన బాగాకనబరిచింది. ఇక నాగినీడు, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ప్రమోదిని తమ పాత్రల మేరకు నటించారు. 
సాంకేతికపరంగా చూస్తే, దర్శకుడు సత్యం రాజ్ కుంపట్ల కొత్తవారితో సాహసంచేసి బాగానే ఔట్ పుట్ రాబట్టగలిగాడు. తనకు తెలిసిన పాయింట్ ను తీసుకుని దాన్నిసినిమాటిక్ గా మలిచాడు. ఈ సినిమాతో విజన్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ అందాలను కెమెరామెన్ మురళీకృష్ణ బాగా బంధించాడు. సంగీత దర్శకుడు రోషన్ సాలూరు కథకు తగిన విధంగా పనిచేశాడు. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 
 
ఇలాంటి సినిమాకు  కథ, కథనం , మలుపులతోపాటు సంగీతం బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. అయితే సినిమా కథను చెప్పే విధానంలో లాగ్ కనిపిస్తుంది. దాంతో కొన్ని చోట్ల విసుగు పుట్టిస్తుంది కూడా. ఏది ఏమైనా దర్శకుడిగా మంచి సినిమా చేశాడనే చెప్పాలి.
రేటింగ్:2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి ల భరతనాట్యం గ్రాండ్ గా విడుదల