Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చారి 111 లో వెన్నెల కిషోర్ ను సరిగ్గా చూపలేకపోయిన దర్శకుడు - రివ్యూ

Vennela Kishore- Samyukta Viswanathan

డీవీ

, శుక్రవారం, 1 మార్చి 2024 (19:46 IST)
Vennela Kishore- Samyukta Viswanathan
కమేడియన్లు హీరోలుగా చేయడం మామూలే. కానీ వారిని సరిగ్గా కథాబలంతో నటనతో ఉపయోగించుకోలేకపోవడం దర్శకుడి తప్పిదమే. లోగడ చాలామంది కమెడియన్లు హీరోలుగా మారినా ఆ తర్వాత యూటర్న్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఇక  వెన్నెల కిషోర్ హీరోగా నటించిన తాజా స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ ‘చారి 111’ ఈరోజే విడుదలైంది.
 
కథగా చెప్పాలంటే.. .   చారి (వెన్నెల కిషోర్) రుద్రనేత్ర అనే సర్వీస్ కంపెనీలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్ప‌డూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ హెడ్ రావు (మురళీశర్మ) చేత చివాట్లు తింటుంటాడు. ఈ క్రమంలో ఓ హ్యుమన్ బాంబ్ ద్వారా ఓ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ను సాల్వ్ చేయడానికి చారి (వెన్నెల కిషోర్) ను ఏజెంట్ గా అపాయింట్ చేస్తారు. అలాగే ‘ప్లాన్ బి’గా ఈషా (సంయుక్త విశ్వనాథన్)ను కూడా ఈ మిషన్ లో భాగం చేస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
వెన్నెల కిషోర్‌ కొద్ది నిముషాల పాటు హీరో స్నేహితుడిగా ట్రావెల్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తే అటు హీరోకూ, కథనానికి చాలా బాగుంటుంది.  కానీ పూర్తిగా హీరోయిజం తరహాలో చూపించాలనుకుంటే దానికి దర్శకుడు చాలా ప్లాన్ చేసుకోవాలి. మానవ బాంబ్ తో దేశాన్ని నాశనం చేయాలనుకునే గ్యాంగ్ ను పట్టుకోవాలంటే సిల్లీ ఏజెంట్ వెళ్లడం, సి.ఎం. కూడా ఇన్ వాల్వ్ కావడం, సి.ఎం.తోనూ సిల్లీ గా మాట్లాడడం ఇవి అస్సలు ఏమాత్రం వర్కవుట్ కాదు. కానీ దర్శకుడు సాహసం చేసి డ్యూటీలో ఎప్ప‌డూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ అంద‌రి చేత చివాట్లు తినే ఏజెంట్ వెన్నెల కిషోర్‌ తరహాలో దర్శకుడిని తిట్టుకోవాల్సి వస్తుంది.
 
సంయుక్త విశ్వ‌నాథ‌న్,  మురళీ శర్మ,  బ్రహ్మాజీ వారి పాత్రలు ఓకే. ఇక కమెడియన్ సత్య, తాగుబోతు రమేష్ పాత్రలు మరీ చిత్రంగా వుంటాయి. రమేష్ పాత్ర జబర్ దస్త్ కు కొనసాగింపులా వుంటుంది. అర్థం పర్థంలేని సన్నివేశాలు ఏవో కామెడీ కోసం చేసే నటన అంతా చాలా బోరింగ్ వుంటుంది. 
 
సినిమాలో పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ గా, రొటీన్ గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఏజెంట్ చారి పాత్ర యొక్క గ్రాఫ్ లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. ద‌ర్శ‌కుడు టీజీ కీర్తి కుమార్ ఫన్నీ పాయింట్ తో చెప్పాలనుకున్న కథలో డెప్త్ లేదు. పైగా సినిమాని ఇంట్రెస్ట్ గా మలచలేకపోయాడు. ప్రేక్షకుడు ఏమిటిరా ఈ గొడవ అన్నట్లుగా వుంటుంది. కమేడియన్ ను కమేడియన్ గా చూపించినా సీరియస్ కథకు సన్నివేశాలపరంగా సీరియస్ గా వుంటూ కథలో ఇన్ వాల్వ్ చేయాలి. అదే ఈసినిమాలో ప్రదాన లోపం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామీణ ప్రేమకథా చిత్రంగా ‘శశివదనే