Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభోదానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందట : జేసీ దివాకర్ రెడ్డి

గత కొన్ని రోజులుగా ప్రభోదానంద స్వామికి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జరుగుతున్న వివాదంపై రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జేస

ప్రభోదానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందట : జేసీ దివాకర్ రెడ్డి
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (18:13 IST)
గత కొన్ని రోజులుగా ప్రభోదానంద స్వామికి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జరుగుతున్న వివాదంపై రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జేసీ దివాకర్ రెడ్డి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభోదానంద ఆశ్రమంలో జరుగుతున్న దుర్మార్గాలను సీఎం చంద్రబాబుకు వివరించినట్లు ఆయన తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభోదానంద ఆశ్రమంలో పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఆడా, మగ తేడాలేదన్నారు. 'కోర్కెలు తీర్చుకుంటే స్వర్గం వస్తుందట.. ప్రభోదానంద ఓ కృష్ణుడు, మిగతావాళ్లు గోపికలు.. ప్రభోదానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందట' అని జేసీ అన్నారు. ఆశ్రమం లోపలికి పోలీసులు వెళ్లి తనిఖీలు చేస్తే ఆయుధాలు దొరుకుతాయన్నారు. 
 
మరోవైపు, ప్రభోదానంద ఆశ్రమ ప్రతినిధి కూడా జేసీ దివాకర్ రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రబోధానంద ఆశ్రమంపై తొలుత దాడి చేసింది ఎంపీ వర్గీయులేనంటూ ఆశ్రమ కమిటీ ప్రతినిధి బీజీ నాయుడు ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఆశ్రమంపై జేసీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా స్వామివారితో జేసీకి రాజకీయ కక్షలున్నాయన్నారు. తమ ఆశ్రమం ఒక పుణ్యక్షేత్రమని... ఆశ్రమంలో తామంతా చాలా ప్రశాంతంగా ఉంటామని చెప్పారు. ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలకు తావే లేదని ఆయన స్పష్టంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న మిర్యాలగూడలో.. నేడు ఎర్రగడ్డలో.. ప్రేమజంటపై వధువు తండ్రిదాడి