Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణాది ప్రేక్షకులు మరాఠీ ఐకాన్ జయవంత్ దాల్వీ ప్రతిభను గుర్తిస్తారు: గుల్కీ జోషి

Gulki Joshi

ఐవీఆర్

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (17:55 IST)
జీ టీవీ 'ఫిర్ సుబహ్ హోగీ'లో ఆమె తొలిసారిగా నటించినప్పటి నుండి, గుల్కీ జోషి ఒక వైవిధ్యమైన నటిగా స్థిరపడ్డారు. 'మేడమ్ సర్' వంటి టెలివిజన్ హిట్స్ అయినా, 'భౌకాల్' వంటి వెబ్ షోలు అయినా లేదా ఆమె వరుస థియేటర్ ప్రొడక్షన్స్‌ అయినా ప్రేక్షకులను మెప్పించడంలో ఆమె ఎప్పుడూ విఫలం కాలేదు. జీ థియేటర్ యొక్క టెలిప్లే 'కాలచక్ర'లో, ఆమె తన అత్తమామలపై పగబట్టి, వారితో అసభ్యంగా ప్రవర్తించే కోడలిగా నటించింది. ప్రఖ్యాత మరాఠీ నాటక రచయిత జయవంత్ దాల్వీ రచించిన 'కాలచక్ర' జీవిత చక్రం, వృద్ధాప్య ఇబ్బందులను ఆకట్టుకునే రీతిలో చూపుతుంది. 
 
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రేక్షకుల కోసం ఈ క్లాసిక్ నాటకం ఇప్పుడు కన్నడ, తెలుగులోకి అనువదించబడింది. ఈ సందర్భంగా గుల్కీ మాట్లాడుతూ, "దక్షిణాది ప్రేక్షకులు ఇప్పుడు మరాఠీ దిగ్గజం జయవంత్ దాల్వీ యొక్క ప్రతిభను గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. 'కాలచక్ర'లోని సూక్ష్మ అంశాలు ప్రతి చోటా ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తాయి, ఎందుకంటే ఈ కథ లేవనెత్తిన సమస్యలు సార్వత్రికమైనవి. తరాల వైరుధ్యాలు ప్రతిచోటా ఒకేలా ఉంటాయి. వాటిని మనం చూసే విధానం కూడా ఒకేలా ఉంటుంది" అని అన్నారు. 
 
నటుడిగా గుల్కీకి థియేటర్‌తో ప్రత్యేక బంధం ఉంది. "నటిగా, తన ప్రయాణం అద్భుతంగా ఉంది. తాను థియేటర్‌తో ప్రారంభించాను, ఆపై టెలివిజన్ మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాను. ప్రదర్శన పరంగా  థియేటర్,  ఇతర మాధ్యమాల కంటే చాలా కఠినమైనది. ఎందుకంటే మీకు ఇక్కడ  రీటేక్ ఉండదు. అలాగే, మీ వాయిస్ మరియు మీ ఎక్స్‌ప్రెషన్‌లు చివరి వరుసలో ఉన్న వ్యక్తిపై కూడా ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా, ప్రేక్షకుల నుండి మీకు తక్షణ స్పందన వస్తుంది" అని అన్నారు. 
 
రంగస్థలం కోసం ఓం కటారే దర్శకత్వం వహించారు. ఇషాన్ త్రివేది చిత్రీకరించిన 'కాలచక్ర'లో ఓం కటారే, పరోమితా ఛటర్జీ, పర్విన్ దబాస్, చందనా శర్మ, ఆనంద్ గోరాడియా, సందీప్ ధబాలే, అశోక్ శర్మ కూడా నటించారు. ఏప్రిల్ 14న ఎయిర్టెల్  స్పాట్‌లైట్, డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్ మరియు డి 2హెచ్  రంగ్‌మంచ్ యాక్టివ్‌లో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెన్సింగ్ దాటిన అభిమాని.. కరెన్సీ నోట్లు.. జాగ్రత్తగా బన్నీ